మిగిలిన వారి విషయాన్ని పక్కన పెడితే.. తెలుగు ప్రజలకు వరకు 2020 చాలా సుపరిచితం. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో తరచూ 2020 అని ప్రస్తావించేవారు. అప్పటికి రాష్ట్రం (అప్పట్లో ఉమ్మడి ఏపీ కాబట్టి) మరో స్థాయికి వెళుతుందని.. విపరీతమైన డెవలప్ మెంట్ ఉంటుందని కథలు.. కథలుగా చెప్పేవారు. దీంతో.. చంద్రబాబు నాయుడి గురించి ఏమాత్రం తెలిసినా.. ‘‘విజన్ 2020’’ మాట తరచూ వినిపించేది. 2014 ఎన్నికల వేళలో.. ఆయన నోటి నుంచి 2020 మాట పెద్దగా వినిపించలేదు. బాబు కోరుకున్నట్లే 2020 వచ్చింది. కానీ.. ప్రజల బతుకుల్లో పెద్ద మార్పు రాకపోవటాన్ని మర్చిపోలేం.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2020లో వచ్చిన కరోనా తెలుగురాష్ట్రాల ప్రజల్ని మాత్రమే కాదు.. ప్రపంచాన్నే వణికిస్తోంది. ఇది సరిపోదన్నట్లు ఈ ఏడాది మరో గండం ప్రపంచం మీదకు రావటం ఖాయమంటున్నారు. మాయదారి వైరస్ నుంచి బయటపడితే చాలు భగవంతుడా అనుకుంటున్న జనాలకు.. ఇప్పుడు మరో బ్యాడ్ న్యూస్ రెఢీ అయ్యింది. విన్నంతనే వణుకు పుట్టే ఈ ఉదంతం మొత్తం సూర్యుడు చుట్టూ తిరగటం షాకింగ్ అని చెప్పక తప్పదు.

సూర్యుడో అగ్నిగోళం అన్న విషయం తెలిసిందే. సూరీడు మీద అక్కడక్కడా ఉండే నల్లటి మచ్చల్ని బ్లాక్ స్పాట్స్ గా అభివర్ణిస్తారు. వీటిల్లో అతి పెద్దది ఒకటి భూమివైపు తిరుగుతుందన్న విషయాన్ని గుర్తించారు. దీని నుంచి అత్యంత తీవ్రమైన అగ్నిఅలలు ఎగిసిపడుతున్నాయి. అంతేకాదు.. ఈ సన్ స్పాట్ సైజు అంతకంతకూ పెరగటం ప్రపంచానికి ఏ మాత్రం క్షేమం కాదని చెబుతున్నారు. ఇప్పటివరకు ఈ తరహా అగ్నిసునామీలు ఐదు వరకు వచ్చినా.. భూమికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. అయితే.. ఇప్పుడు వచ్చింది మాత్రం రోటీన్ కు కాస్త భిన్నమైదిగా చెబుతున్నారు. ఇప్పటివరకు వచ్చిన వాటి కంటే తాజాగా వచ్చింది మాత్రం అతి పెద్దదని చెబుతున్నారు.

శాస్త్రీయంగా చెప్పాలంటే దీన్ని కరొనల్ మాస్ ఇజెక్షన్స్ (సీఎంఈ)గా అభివర్ణిస్తుంటారు. ఈ సన్ స్పాట్ పెద్దది అయ్యే కొద్దీ.. దీని నుంచి వెలువడే తీవ్రమైన అగ్నికీలలు భూమిపై ఉండే రేడియో తరంగాల్ని. దెబ్బ తీస్తాయని.. అదే జరిగితే జీపీఎస్ వ్యవస్థతో పాటు.. భూమి చుట్టు తిరిగే అనేక శాటిలైట్లు కూడా ప్రమాదానికి గురవుతాయని చెబుతున్నారు. పవర్ గ్రిడ్లకు పెను మప్పు తప్పదంటున్నారు. దీనికి కారణంగా కమ్యునికేషన్ వ్యవస్థ తీవ్ర ఇబ్బందికి గురయ్యే ప్రమాదం పొంచి ఉందంటున్నారు. కొన్నిసార్లు సూర్యుడి అయస్కాంత క్షేత్రాల్లో మార్పులు వచ్చినప్పుడు భారీ పేలుళ్ల ఉంటాయని.. వీటి సైజుభూమికి మించి ఉంటాయంటున్నారు.

హిరోషిమా.. నాగసాకీ మీద అమెరికా ప్రయోగించిన అణు బాంబల కారణంగా వెలువడిన శక్తికి కొన్ని లక్షల రెట్లు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు. ప్రపంచానికి విపత్తు ముప్పు పొంచి ఉందంటున్నారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలు చేయగలిగింది ఏమీ లేదు. సూరీడి మీద భారం వేసి.. ఇప్పుడున్న కరోనాను కంట్రోల్ చేయమటంతో పాటు..సూర్యుడిలో పేలుడు ద్వారా రానున్న రోజుల్లో ప్రపంచానికి ఎంత ముప్పు అన్నది కాలం చెప్పే సమాధానాల కోసం వెయిట్ చేయటం తప్పించి.. ఇంకేం చేయలేని పరిస్థితి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
antalya escort
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort