జీడిమెట్లలో దారుణం.. ఒంటిపై పెట్రోలు పోసుకుని నిప్పటించుకున్న వ్యక్తి
By తోట వంశీ కుమార్ Published on 15 May 2020 5:06 PM ISTజీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి నడిరోడ్డుపై పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన స్థానికులు మంటలను ఆర్పేందుకు యత్నించారు. ఘటన వివరాల్లోకి వెళితే.. జీడిమెట్ల పీఎస్ పరిధిలోని చింతల్, సుదర్శన్ రెడ్డి నగర్‌లో భువన్ రెడ్డి(30) అనే వ్యక్తి భార్య, కూతురితో కలిసి నివసిస్తున్నాడు. అతను ఓ ప్రవేట్ సంస్థలో పనిచేస్తుండగా.. అతడి భార్య వారుఅద్దెకుండే ఇంటిలోనే బ్యూటీ పార్లర్ నడుపుతోంది. ఈ క్రమంలో భార్య, భర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవి.
ఇలాగే 20 రోజుల క్రితం ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో భార్య సమీపంలోని బంధువుల ఇంటికి వెళ్లింది. అయినప్పటికి అక్కడికి వెళ్లి మరీ భార్యను భువన్ రెడ్డి తీవ్రంగా కొట్టాడు. అప్పుడు అతని భార్య అతడిపై పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. అప్పటి నుండి ఆమె బంధువల ఇంటిలోనే ఉంటోంది. భువన్ రెడ్డి ఎన్నిసార్లు ఇంటికి రమ్మని పిలిచినా రాలేదు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై శుక్రవారం మధ్యాహ్నం తాను నివాసం ఉంటున్న భవనం కిందకు వచ్చి పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. గమనించిన స్థానికులు గోనె సంచిలతో మంటలను ఆర్పేందుకు యత్నించాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. సుమారు 60శాతం మే కాలిన గాయాలు అయినట్లు తెలుస్తోంది.