కంటైన్మెంట్ ఫ్రీ జోన్ గా మలక్ పేట్
By రాణి
కొద్దిరోజుల క్రితం తెలంగాణలో కరోనా విజృంభిస్తున్న సమయంలో కొన్ని ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లు గా ప్రకటించింది ప్రభుత్వం. ఒక్క హైదరాబాద్ లోనే 15 పైగా కంటైన్మెంట్ జోన్లున్నాయి. వీటిలో ఒకటి మలక్ పేట. మలక్ పేటలో అత్యధిక కరోనా కేసులు నమోదవ్వడంతో దానిని కంటైన్మెంట్ జోన్ గా చేశారు పోలీసులు. ఆ ఏరియా నుంచి ఎవరూ బయటికి పోకుండా, ఇతరులు ఆ ఏరియాలోకి రాకుండా కంచెలు ఏర్పాటుచేశారు. ఒకే కుటుంబానికి చెందిన 11 మందికి కరోనా సోకినట్లు నిర్థారణవ్వడంతో మరింత అప్రమత్తమయ్యారు. ఇప్పుడు వారందరికీ ఐసోలేషన్ ముగిసి, నెగిటివ్ రిపోర్టులు రావడంతో స్థానిక ఎం ఐ ఎం పార్టీ ఎమ్మెల్యే బలాల, తూర్పు మండలం డిసిపి రమేష్, ఏసీపీ దేవేందర్, జి హెచ్ ఎం సీ జోనల్ కమిషనర్ అశోక్ సామ్రాట్ ల ఆధ్వర్యంలో కంటోన్మెంట్ కంచెలను తొలగించారు. కంచెల తొలగింపుతో 750 ఇళ్లకు విముక్తి లభించింది. మలక్ పేట్ ను కంటైన్మెంట్ ఫ్రీ జోన్ గా ప్రకటించడంతో స్థానికులు చప్పట్లు కొడుతూ పోలీసులు, వైద్యులు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read : బ్రేకింగ్ న్యూస్ : నటుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత
తెలంగాణలో కరోనా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతోంది. ప్రతిరోజూ వందల మందికి పరీక్షలు చేస్తుండగా..కొత్తగా నమోదవుతున్న పాజిటివ్ కేసులు 10 లోపే ఉంటున్నాయి. దీంతో త్వరలోనే తెలంగాణ కరోనా ఫ్రీ రాష్ట్రంగా బయటపడుతుందని మంత్రి ఈటెల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకొద్ది రోజులు ఓపిక పడితే లాక్ డౌన్ సడలిస్తారన్న ఆశతోప్రజలు కూడా ఇళ్లలో ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
Also Read :30 వేలకు పైగా కేసులు..1000 దాటిన మరణాలు