భారత్ లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో మే 3వ తేదీ తర్వాతనైనా లాక్ డౌన్ ను ఎత్తివేస్తారో లేదోనన్న ఆందోళనలో ఉన్నారు ప్రజలు. మరోవైపు జూలై 31వ తేదీ వరకూ ఐటీ ఉద్యోగులు జూలై 31 వరకూ వర్క్ ఫ్రమ్ హోం చేయాలని ఆదేశాలిచ్చిన నేపథ్యంలో లాక్ డౌన్ అప్పటి వరకూ కొనసాగుతుందా ? అన్న ప్రశ్నలొస్తున్నాయి. లాక్ డౌన్ అమల్లో ఉన్నప్పటికీ వైరస్ సామాజిక వ్యాప్తి చెందుతుండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో మాత్రం ప్రస్తుతానికి వైరస్ తగ్గుముఖం పట్టినట్లే అనిపిస్తుంది. ఏపీలో మాత్రం రోజూ 70-80 కొత్త కేసులు నమోదవుతున్నాయి. అదేమంటే తెలంగాణలో వైరస్ నిర్థారణ పరీక్షలు చాలా తక్కువగా చేస్తున్నారని, అందుకే కేసులు తక్కువగా ఉన్నాయంటున్నారు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ కరోనా కేసుల సంఖ్య 30వేలు దాటిపోయింది. బుధవారానికి 31,332 కేసులు నమోదవ్వగా మృతుల సంఖ్య 1007కు పెరిగింది. 7,696 మంది కోలుకున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 8,590 కేసులు నమోదవ్వగా 369 మంది మృతి చెందారు.

Also Read :క‌రోనాను పూర్తిగా నియంత్రించ‌లేం.. అదొక్క‌టే మార్గం..!

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.