బ్రేకింగ్ న్యూస్ : న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

By రాణి  Published on  29 April 2020 6:54 AM GMT
బ్రేకింగ్ న్యూస్ : న‌టుడు ఇర్ఫాన్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ బాలీవుడ్, హాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ (53) బుధవారం మృతి చెందారు. కొంతకాలంగా పెద్ద పేగు సంబంధిత వ్యాధితో తీవ్ర అనారోగ్యానికి గురైన ఇర్ఫాన్ ఖాన్ మంగళవారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుప‌త్రిలో చేరారు. ఆస్పత్రిలో చేరడంతోనే ఇర్ఫాన్ ఖాన్ మృతి చెందారంటూ వచ్చిన వార్తలను ఆయన కుటుంబ సభ్యులు తోసిపుచ్చారు. భార్య, ఇద్దరు కుమారులతో ఇర్ఫాన్ ముంబైలోనే ఉంటున్నారు. 2018లో ఓ ట్యూమర్ తో బాధపడుతున్న ఇర్ఫాన్ యూకేలో చికిత్స తీసుకున్నారు. అప్పటికి కాస్త ఉపశమనం పొందినా..మళ్లీ ఈ రూపంలో మృత్యువు కబళించింది.

Also Read : 30 వేలకు పైగా కేసులు..1000 దాటిన మరణాలు

కాగా గత శనివారమే ఇర్ఫాన్ తల్లి సైదా బేగం జైపూర్ లో కన్ను మూశారు. దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుండటంతో కన్నతల్లిని కడసారి చూసి అంత్యక్రియలు చేయలేని పరిస్థితి. దీంతో వీడియో కాల్ లోనే తల్లికి నివాళులర్పించారు. 1967 జనవరి 7వ తేదీన జన్మించిన ఇర్ఫాన్ హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకాదరణ పొందారు. ఒకసారి జాతీయ పురస్కారం, నాలుగుసార్లు ఫిలింఫేర్ అవార్డులను అందుకున్న ఇర్ఫాన్ ఖాన్ మృతితో సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. ఇర్ఫాన్ ఖాన్ మరణవార్త తమనెంతో బాధింపజేసిందంటూ ప్రముఖ నటులు ట్వీట్లు చేస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇర్ఫాన్ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.

Also Read : విరుగుడు మంత్రం కనిపెట్టిన వైసీపీ సర్కార్‌..!

Next Story