విజయవాడ: నగరంలో సినీ హీరో మహేష్‌ బాబు సందడి చేశారు. ఓ ప్రముఖ బంగారు అభరణాల షాపుని ప్రారంభించిన మహేష్‌ బాబుని చూసేందుకు షాపు వద్దకు భారీగా అభిమానులు తరలివచ్చారు. అభిమానుల తాకిడి దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మహేష్‌ బాబు రాకకోపం బందరు రోడ్డుని షాపు నిర్వహకులు ఆక్రమించారు. దీంతో భారీ ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. తాను ఎప్పుడు విజయవాడ వచ్చినా ఎంతో ఆనందంగా ఉంటుందని మహేష్‌ బాబు అన్నారు. నా సినిమాలకు సంబంధించి ఎక్కువ ఫంక్షన్లు విజయవాడలో నిర్వహించామన్నారు. కొత్త సినిమా ‘సరిలేరు నీకెవ్వరు’ సంక్రాంతి పండుగకు రిలీజ్‌ అవుతుందన్నారు. అభిమానులు గర్వపడేలా కొత్త సినిమా ఉంటుందని, ప్రతి ఒక్కరూ సినిమా చూడాలని మహేష్ బాబు అన్నారు.

ఇది కూడా చదవండి:

సూపర్ స్టార్ మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ డేట్ ఫిక్స్

ఇది కూడా చదవండి:

సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా “రణస్థలం” ఫస్ట్ లుక్ విడుదల

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.