మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. సోమవారం రెండు రాష్ట్రాల్లో ఓటింగ్ జరగనుంది. ఈ రెండు రాష్ట్రాలతో పాటు 16 రాష్ట్రాల్లోని 51 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈవీఎంలు, సిబ్బందిని పో లింగ్ కేంద్రాలకు తరలించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మహారాష్ట్రలో 3 లక్షల మంది, హర్యానాలో 75 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

మహారాష్ట్ర: 288 స్థానాలు, అభ్యర్ధులు 3,237

మహారాష్ట్రలో 288 అసెంబ్లీ స్థానాలకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 3,237 మంది అభ్యర్థులు బరిలోకి దిగారు. ఇందులో 235 మంది మహిళలున్నారు. బీజేపీ-శివసేన కూటమి, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి మధ్య హోరాహో రీ పోరు జరిగింది. బీజేపీ 164 స్థానాల్లో పోటీ చేస్తుండగా, శివసేన 124 సీట్లలో అభ్యర్థులను బరిలోకి దింపింది. కాంగ్రెస్‌ నుంచి 147 మంది, ఎన్సీపీకి చెందిన 121 మంది బరిలోకి దిగారు. రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని MNS 101 స్థానాల్లో పోటీ పడుతోంది. మజ్లిస్‌-51, సీపీఐ-16, సీపీఎం 8 స్థానాల్లో పోటీ చేస్తోంది. బీఎస్పీ 262 స్థానాల్లో అభ్యర్థులను దింపింది. 14 వందల మంది స్వతంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లో బీజేపీ 122 సీట్లు గెలుచుకోగా, శివసేన 63, కాంగ్రెస్‌ 42, ఎన్సీపీ 41 స్థానాల్లో గెలుపొందాయి.

హర్యానా: 90సీట్లు..అభ్యర్దులు 1,169

హర్యానాలో 90 అసెంబ్లీ సీట్లున్నాయి. మొత్తం 1,169 మంది పోటీ పడుతున్నారు. ఇందులో 105 మంది మహిళలున్నారు. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌, జన నా యక్‌ జనతాపార్టీ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 48, ఐఎన్‌ఎల్‌డీ 19, కాంగ్రెస్‌కు 17 సీట్లు వచ్చాయి. తాజా శాసనసభ ఎన్నిక లల్లో కనీసం 75 స్థానాలు దక్కించుకోవాలని కమలదళం తహతహలాడుతోంది.

16 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు

2 రాష్ట్రాల అసెంబ్లీలతో పాటు 16 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉత్తరప్రదేశ్‌లో 11 స్థానాలకు బై ఎలక్షన్స్ జరగనున్నాయి. బిహార్‌లో ఐదు అసెంబ్లీ, ఒక లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. గుజరాత్-6, కేరళ-5, పంజాబ్‌-4, అసోం-4, సిక్కిం-3 స్థానాలకు బై ఎలక్షన్స్ జరగను న్నా యి. హిమాచల్‌ప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడుల్లో రెండేసి సీట్లు, అరుణాచల్‌ప్రదేశ్‌, మేఘాలయ, మధ్యప్రదేశ్‌, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ, పుదుచ్చేరిలో ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీకి పాటు ఒక లోక్‌సభ స్థానానికి బై ఎలక్షన్స్ జరగనుంది.

యూపీలో చతుర్ముఖ పోటీ

ఉప ఎన్నికలు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అగ్నిపరీక్షలా మారాయి. రాష్ట్రంలో 11 అసెంబ్లీ స్థానాలకు బై ఎలక్షన్స్ జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన సమాజ్‌పార్టీ, కాంగ్రెస్‌ మధ్య చతుర్ముఖ పోటీ నెలకొంది. ఈ 11 స్థానాల్లో గతంలో బీజేపీనే 8 స్థానాల్లో గెలుపొందింది. శాంతి భద్రతలు, ఆర్టికల్‌ 370 రద్దు తదితర అంశాలు ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.