అమ్మాయిల హాస్టల్లో 10 మంది యువకులు.. ఏకంగా 4 గంటల పాటు..

By అంజి  Published on  23 Feb 2020 10:25 AM GMT
అమ్మాయిల హాస్టల్లో 10 మంది యువకులు.. ఏకంగా 4 గంటల పాటు..

ముఖ్యాంశాలు

  • బాలికల వసతి గృహంలో యువకుల హల్‌చల్‌
  • హాస్టల్‌ కిచెన్‌లోకి వెళ్లి బిర్యానీ వండి బాలికలకు యువకుల విందు
  • ఘటనపై వార్డెన్‌ను నిలదీసిన ప్రతినిధులు

కృష్ణా జిల్లాలో మరో అరాచక ఘటన వెలుగులోకి వచ్చింది. నూజివీడు ట్రిపుల్‌ ఐటీ ఘటన మరువకముందే.. మచిలీపట్నంలో మరో ఘటన జరిగింది. శనివారం రాత్రి బచ్చేపేటలోని బాలికల వసతి గృహంలో యువకులు హల్‌చల్‌ చేశారు. వసతి గృహంలోని వంట రూమ్‌లో బిర్యానీ వండి.. అమ్మాయిలతో కలిసి యువకులు విందు చేసుకున్నారు. మిత్రుడి పుట్టిన రోజు వేడుకల పేరుతో 10 మంది యువకులు బాలికల వసతిగృహంలోకి వచ్చారు. యువకులు వచ్చిన సమయంలో వసతి గృహంలో వార్డెన్స్‌ ఎవరూ లేరని తెలుస్తోంది. స్థానికులు ద్వారా సమాచారం తెలుసుకున్న వైసీపీ, టీడీపీ, ఐద్వా, బీసీ ప్రతినిధులు అక్కడి చేరుకొని.. వార్డెన్‌ను నిలదీసినట్లు సమాచారం. బాలికల వసతి గృహంలో యువకులు ఏకంగా 4 గంటల పాటు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పుడి ఘటన కృష్ణా జిల్లాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. విద్యార్థినుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నూజీవీడు ట్రిపుల్ ఐటీలో విద్యార్థినుల హాస్టల్‌లో ప్రవేశించి ఓ యువకుడు రోజంతా అక్కడే ఉన్న సంగతి తెలసిందే. అమ్మాయిల హాస్టల్లోని మంచం కింద పడుకున్న ఓ యువకుడు సెక్యూరిటీకి రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిపోయాడు. ఐటీ కాలేజీలో గత కొన్ని రోజులుగా ఫెస్ట్‌ నిర్వహిస్తున్నారు. దీంతో ఐటీ కాలేజీ అధికారులు, సిబ్బంది అంతా ఆ పనుల్లోనే నిమగ్నమయ్యారు. ఆ విద్యార్థి అమ్మాయిల హాస్టల్‌లో దూరిపోయాడు. ఈ ఘటనపై ఇద్దరు విద్యార్థులకు అధికారులు కౌన్సిలింగ్‌ ఇచ్చి ఇళ్లకు పంపారు. ఈ వ్యవహారాన్ని క్రమశిక్షణ కమిటీకి పంపుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి క్రమ శిక్షణ కమిటీ సోమవారం నిర్ణయం తీసుకోనుంది.

Next Story
Share it