జాతీయ రహదారిపై ఢివైడర్‌ను ఢీకొన్న లారీ.. ఇద్దరు సజీవ దహనం
By తోట వంశీ కుమార్ Published on 7 Jun 2020 2:11 PM IST
హైదరాబాద్ కడప జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కడప జిల్లా దువ్వూరు మండలం చింతకుంట వద్ద జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నాం లారీ డివైడర్ ఢీకొట్టి బోల్తాపడింది. మంటలు చెలరేగడంతో.. లారీ డ్రైవర్, క్లీనర్ సజీవ దహనమయ్యారు.
కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నుంచి కడప జిల్లా మైదుకూరు వైపుగా వెళ్తున్న సిమెంట్ లారీ అదుపు తప్పి డివైండర్‌ను ఢీకొట్టి బోల్తాపడింది. వెంటనే లారీలో మంటలు చెలరేగాయి. క్యాబిన్‌లో డ్రైవర్, క్లీనర్ ఇరుక్కుపోయారు. వెంటనే స్పందంచిన స్థానికులు అక్కడకు చేరుకుని వారిని రక్షించే ప్రయత్నం చేసినా.. మంటలు ఎక్కువగా ఉండడంతో వారిని కాపాడలేకపోయాడు. దీంతో వారు సజీవ దహనమయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైరింజన్ వచ్చే లోపే లారీ పూర్తిగా దగ్ధమైంది.
Next Story