సోనూ సూద్ ట్రాక్టర్ సాయంపై స్పందించిన లోకేష్‌

By Medi Samrat  Published on  26 July 2020 3:53 PM GMT
సోనూ సూద్ ట్రాక్టర్ సాయంపై స్పందించిన లోకేష్‌

చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఓ రైతు కాడెద్దులతో, ట్రాక్టర్ తో పొలం దున్నించుకునేందుకు డబ్బులేక తన ఇద్దరు కుమార్తెల సాయంతో పొలం దున్నడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. లాక్ డౌన్ పరిస్థితుల్లో చితికిపోయిన ఓ టమోటా రైతు దయనీయ స్థితికి ఈ వీడియో అద్దం పట్టింది.

అయితే, ఈ వీడియోను చూడాల్సిన వాళ్లే చూశారు! ఇప్పటికే వేలాదిమంది వలసజీవులకు ఎంతో ఉపకారం చేసిన బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ఈ అక్కచెల్లెళ్ల కష్టాన్ని చూసి చలించిపోయారు. వారికి ఓ ట్రాక్టర్ కొనివ్వాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని ట్విట్టర్ లో వెల్లడించారు. తొలుత వారికి ఓ జత ఎద్దులు కొనివ్వాలని నిర్ణయించుకున్నా, ఆపై మనసు మార్చుకుని సోనాలికా ట్రాక్టర్ అందించాలని నిశ్చయించుకున్నారు. సాయంత్రానికల్లా ఓ ట్రాక్టర్ మీ పొలాన్ని దున్నుతూ ఉంటుంది అంటూ సోనూ సూద్ ట్వీట్ చేశారు.దీనిపై టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్ స్పందించారు. కరోనా కష్టకాలంలో మీరు చేస్తున్న అద్భుతమైన సహాయ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. చిత్తూరు జిల్లా రైతు కుటుంబం పట్ల మీరు ప్రదర్శించిన సానుభూతి, దయ నిజంగా అభినందనీయం అంటూ ట్వీట్ చేశారు.Next Story
Share it