లాక్ డౌన్ ఎత్తేస్తే.. పరిస్థితులు మరీ దారుణంగా తయారవుతాయి: డబ్ల్యూ.హెచ్.ఓ.

By సుభాష్  Published on  11 April 2020 3:39 PM IST
లాక్ డౌన్ ఎత్తేస్తే.. పరిస్థితులు మరీ దారుణంగా తయారవుతాయి: డబ్ల్యూ.హెచ్.ఓ.

కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఎటువంటి వ్యాక్సిన్ లేదు.. ఎక్కువ మంది వైరస్ బారిన పడినా కూడా దేశాలకు కష్టమే..! ప్రస్తుతం ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వాలు.. లాక్ డౌన్ కే మొగ్గు చూపుతున్నాయి.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా ఇదే సూచిస్తోంది. లాక్ డౌన్ ను ఎత్తివేస్తే చాలా కష్టాలువస్తాయని.. పరిస్థితి చేయి దాటిపోయే అవకాశం ఉందని చెబుతోంది. ఆఫ్రికాలో కరోనా వైరస్ ప్రబలడంపై వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం కొన్ని దేశాల్లో లాక్ డౌన్ ను ఎత్తి వేస్తున్నారని.. కానీ అలా చేయడం వలన తిరిగి ప్రబలే అవకాశం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానం గెబ్రెయేసుస్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో వెల్లడించారు.

కరోనా వైరస్ ప్రబలడం తగ్గడాన్ని కొన్ని ఈరోపియన్ దేశాల్లో చూశామని.. కానీ 16కు పైగా ఆఫ్రికన్ దేశాల్లో వైరస్ విపరీతంగా ప్రబలడం మొదలైందని అన్నారు. 1.5 మిలియన్ల కరోనా కేసులు ఇప్పటి వరకూ నమోదయ్యాయని.. 92000 పైగా మరణాలు సంభవించాయని జెనీవాకు చెందిన న్యూస్ ఏజెన్సీ తెలిపిందని టెడ్రోస్ అన్నారు.

యెమెన్ దేశం మొదటి కరోనా వైరస్ కన్ఫర్మ్ కేసు నమోదయ్యిందని తెలిపిందని.. ఇప్పటికే ఆ దేశంలో యుద్ధం కారణంగా హెల్త్ సిస్టమ్ అన్నది దారుణంగా తయారైందని.. సరైన ఫుడ్ లేకుండా ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని.. కరోనా ప్రబలితే మరిన్ని ఇబ్బందులు తప్పవని ఆయన అంటున్నారు.

హెల్త్ వర్కర్లలో వైరస్ ప్రబలడం కూడా భయపడాల్సిన అంశమని.. చాలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కొన్ని దేశాల్లో 10 శాతం మంది హెల్త్ వర్కర్లకు కరోనా సోకిందని.. ఇలాంటివి జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. యునైటెడ్ నేషన్స్ సప్లై టాస్క్ ఫోర్స్ కూడా ప్రొటెక్టివ్ వస్తువుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది.

"ప్రతి నెల.. దాదాపు 10 మిలియన్స్ మాస్కులను సప్లై చేయాల్సి ఉంటుందని, 25 మిలియన్ల N-95 మాస్కులు, గౌన్స్, ఫేస్ షీల్డ్స్, 2.5 మిలియన్ల డయాగ్నస్టిక్ టెస్ట్స్, పెద్ద ఎత్తున ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్.. మిగతా క్లినికల్ కేర్ వస్తువుల అవసరం ఉంది" అని అన్నారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ లో భాగంగా చాలా మందికి తినడానికి తిండి సప్లై చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ కు 280 మిలియన్ డాలర్లకు పైగానే ఖర్చు అవుతుందని అన్నారు. దాతలు సహాయం చేయాలని కూడా ఆయన అర్థించారు. ఏ దేశం కూడా కరోనా మహమ్మారి నుండి తప్పించుకోలేకపోతోందని.. ఇది ప్రపంచ వ్యాప్తంగా ప్రబలుతోంది అన్నారు. జపాన్ దేశంలోని కొన్ని ప్రాంతాలకు బయట ప్రపంచంతో ఎటువంటి సంబంధం కూడా లేదని.. అలాంటి ప్రాంతాల్లో కూడా వైరస్ ప్రబలడం మొదలైందని మనం అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సిన సమయం ఇదని ఆయన అన్నారు. పలు దేశాల్లో పబ్లిక్ హెల్త్ సిస్టమ్స్ అన్నవి సరిగా ఏర్పాటు చేసుకోవాలన్న సంకేతాలు పంపిస్తోందని అన్నారు. ఏ దేశం కూడా తమది దృఢమైన హెల్త్ సిస్టమ్ అని చెప్పుకోలేదని అన్నారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ నిజాయితీగా వ్యవహరించాలని టెడ్రోస్ అన్నారు.

Next Story