నేటి నుంచి లాక్‌డౌన్5.0: ప్రస్తుత దశ అన్‌లాక్1.0
By సుభాష్ Published on 1 Jun 2020 6:47 AM GMTదేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినా ఏ మాత్రం తగ్గడం లేదు. కరోనా తీవ్ర స్థాయిలో ఉండటంలో లాక్‌డౌన్‌ను జూన్ 30వ తేదీ వరకూ పొడిగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ దశలో కేవలం కంటైన్‌మెంట్ జోన్లకే లాక్‌డౌన్ పరిమితం చేసింది. ఈ విడత లాక్‌డౌన్‌లో కంటైన్‌మెంట్ జోన్లు కాకుండా మిగితా ప్రాంతాల్లో అన్నింటికి సడలింపులు ఇచ్చింది. దశల వారీగా లాక్‌డౌన్ నిబంధనలు సడలింపులు ఇస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ మేరకే కేంద్ర హోంమంత్రిత్వశాఖ శనివారం కొత్త మార్గదర్శకాలను సైతం విడుదల చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దశను అన్‌లాక్ 1.0గా పేర్కొంటూ ఆర్థిక వృద్ధికి దోహం చేసే కార్యకలాపాలపై ముందు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇక కరోనా కట్టడిలో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలు చేసి ఇప్పటికే 65 రోజులు గడిచింది. మార్చి 25 నుంచి ప్రారంభమైన లాక్‌డౌన్ ఇప్పటి వరకూ పొడిస్తూ కొనసాగుతూనే ఉంది. ఈ సమయంలో అత్యవసర సేవలు తప్ప కఠినంగా లాక్‌డౌన్ అమలవుతోంది. దశల వారీగా కరోనా కేసులను బట్టి రెడ్‌జోన్, గ్రీన్ జోన్, ఆరెంజ్‌జోన్లను ప్రకటించారు. గ్రీన్ జోన్లలో కొన్నింటికి సడలింపులు ఇచ్చి, ఆరెంజ్ జోన్లలో స్వల్పంగా కొన్ని మినహాయింపులు ఇచ్చారు. ఇక రెడ్ జోన్‌లలో మాత్రం ఎలాంటి సడలింపులు ఇవ్వకుండా లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు అధికారులు.
మే 4 నుంచి మొదలైన మూడో దశ లాక్‌డౌన్ 14 రోజుల పాటు కొనసాగి మే 17వ తేదీన ముగియగా, దానిని వెంటనే లాఖరు వరకూ పొడిగించారు. ఈ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం కొన్ని సడలింపులు కూడా ఇచ్చింది. ఇక తాజాగా విధించిన లాక్‌డౌన్ 5.0లో భారీగానే సడలింపులు ఇచ్చింది కేంద్రం.
► కంటైన్‌మెంట్ జోన్లలో లాక్‌డౌన్ జూన్ 3 వరకు కొనసాగుతుంది
► కంటైన్‌మెంట్ జోన్ పరిధిలోని జిల్లా అధికారులు నిర్ధిశిస్తారు.
► కంటైన్మెంట్ జోన్లలో కేవలం నిత్యావసర వస్తువులకు మాత్రమే అనుమతి ఉండాలి. ► జోన్లలో నుంచి ప్రజలెవ్వరు బయటకురాకుండా చర్యలు చేపట్టాలి.
► కంటైన్‌మెంట్ జోన్‌లో బయట బఫర్‌జోన్లపై రాష్ట్రాలు, కేంద్ర పాలిన ప్రాంతాలు నిర్ణయం తీసుకోవచ్చు. వివిధ దశల్లో వివిధ రకాలైన సంస్థలు తెరుచుకోవడానికి అనుమతులు ఇస్తూ హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.
జూన్ 8 నుంచి..
ఫేజ్ -1
► ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు అనుమతి
► హోటళ్లు, రెస్టారెంట్లు, వసతి సేవలు, షాపింగ్ మాల్స్‌కు అనుమతి.
►కర్ఫ్యూ సమయం మరింత సడలింపు ఇస్తూ, రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకూ
ఫేజ్ – 2
► పాఠశాలలు, కళాశాలలు, విద్యాసంస్థలు తెరిచేందుకు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలకే అధికారం
► విద్యాసంస్థలు పునః ప్రారంభంపై జులైలో నిర్ణయం
►విద్యాసంస్థలు పునః ప్రారంభం విషయంలో కేంద్ర ఆరోగ్యశాఖ మార్గదర్శకాలను జారీ చేస్తుంది.
ఫేజ్ – 3
►అంతర్జాతీయ విమాన సేవలు (కేంద్ర హోంశాఖ అనుమతులతో)
► మెట్రో రైలు వ్యవస్థకు అనుమతి
►జిమ్ములు, సినిమాహాళ్లు, స్విమ్మింగ్ ఫూల్స్, పార్కులు, బార్లు
► ఆడిటోరియంలు, అసెంబ్లీ హాల్స్, సమావేశ ప్రాంతాలు
► రాజకీయ, విద్యా, సాంస్కృతి, మతపరమైన సమావేశాలు
వీటికి పరిస్థితులను బట్టి అనుమతులు ఉంటాయి.
లాక్‌డౌన్ 5.0లో అనుమతి లేనివి:
► మెట్రో రైలు సేవలకు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. అలాగే అంతర్జాతీయ విమానలకు అనుమతి లేదు
► రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి లేదు.