కేంద్రం కీలక నిర్ణయం.. మరికొన్ని షాపులకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపు

By సుభాష్  Published on  23 April 2020 5:26 PM IST
కేంద్రం కీలక నిర్ణయం.. మరికొన్ని షాపులకు లాక్‌డౌన్‌ నుంచి సడలింపు

దేశ వ్యాప్తంగా కరోనా కాటేస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటోంది. దీంతో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ నుంచి దేశ ప్రజలకు కాస్త ఊరటనిచ్చింది.

ఈ సందర్భంగా కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ సంయుక్త కార్యదర్శి లవ్‌ అగర్వాల్‌ గురువారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి పలు వివరాలు వెల్లడించారు. గ్రామీణ వ్యవస్థను మెరుగుపర్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. దేశంలో వైద్యులపై జరుగుతున్న దాడులను దృష్టిలో ఉంచుకుని వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామన్నారు.

లాక్‌డౌన్‌ ఆంక్షల నుంచి దేశంలోని అర్బన్‌ ప్రాంతాల్లోని నాన్‌ హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో పలు మినహాయింపులు ఇచ్చింది. మొబైల్‌ రిచార్జ్‌, సిమెంట్‌, పుస్తకాల షాపులు వంటి షాపులకు కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ నుంచి కాస్త వెసులుబాటు కల్పించింది. హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో ఎలాంటి మినహాయింపులు ఇవ్వలేదు.

లాక్‌డౌన్‌ నుంచి వీటికి మినహాయింపు

1మొబైల్‌ రిచార్జ్‌ షాపులు
2ఆటా కంపెనీలు
3రోడ్ల నిర్మాణాలపై ఆంక్షలు సడలింపు
4పుస్తకాలు, స్టేషనరీ షాపులు
5ఫ్యాన్లు విక్రయించే ఎక్ట్రానిక్ షాపులు
6సిమెంట్‌ షాపులు
7పిండి మిల్లులు
8నిర్మాణ రంగానికి సంబంధించిన మెటిరీయల్‌ విక్రయించే షాపులు

Next Story