తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 9:52 PM IST
తెలంగాణలో మందుబాబులకు గుడ్ న్యూస్

తెలంగాణలో ప్రభుత్వం మందుబాబులకు ప్ర‌భుత్వం శుభవార్త చెప్పింది. మ‌ద్యం అమ్మకాల స‌మ‌యాన్ని పొడిగించింది. నేటి నుంచి మ‌ద్యం దుకాణాలు రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంటాయ‌ని అబ్కారీ శాఖ వెల్ల‌డించింది. జీవో ఎంఎస్‌ నం 72 ప్రకారం కంటైన్మెంట్‌ జోన్లలో మినహా మిగిలిన ప్రాంతాల్లోని మద్యం దుకాణాల్లో విక్రయాలు జరపొచ్చని ఎక్సైజ్‌ కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ఇటీవల తెలంగాణలో మద్యం షాపులు తిరిగి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకే తెరిచి ఉండేవి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కంటైన్‌మెంట్‌ జోన్లు మినహా ఇతర ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు మద్యం షాపులు తెరిచి ఉంచనున్నారు. దీంతో అదనంగా మరో 2 గంటల పాటు మద్యం కొనుగోలుకు అవకాశం లభించడంతో.. మందుబాబులు సంబరపడుతున్నారు. ఈ నిర్ణయంతో లిక్కర్ కొనుగోలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. అలాగే ప్రభుత్వానికి కూడా మరికొంత ఆదాయం లభించనుంది.

మరోవైపు క‌ర్ఫ్యూని స‌మ‌యాన్ని రాత్రి 9 నుంచి ఉద‌యం 5 గంట‌ల‌కు మార్చ‌గా.. ఆస్పత్రులు, మందుల దుకాణాలు మినహా అన్ని షాపులను రాత్రి 8 గంటల వరకు తెరిచి ఉంచుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిన సంగతి తెలిసిందే.

Next Story