తెలంగాణ‌లో మ‌రో 94 కేసులు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  1 Jun 2020 3:01 PM GMT
తెలంగాణ‌లో మ‌రో 94 కేసులు

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తోంది. రోజు రోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లోనే కొత్తగా 94 కరోనా పాజిటివ్‌ కేసులు న‌మోదు కాగా.. 4 గురు మృతి చెందార‌ని తెలంగాణ ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 2792 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కాగా.. 88 మంది మృతి చెందారు. ఈ రోజు న‌మోదు అయిన కేసులు మొత్తం తెలంగాణ‌లోనివే.

అత్య‌ధికంగా జీహెచ్ఎంసీ ప‌రిధిలో 79 కేసులు న‌మోదు కాగా.. రంగారెడ్డిలో 3, మ‌హ‌బూబాబాద్ 1, మేడ్చ‌ల్ 3, మెద‌క్ 2, పెద్ద‌ప‌ల్లి 1, న‌ల్ల‌గొండ 2, సంగారెడ్డి 2, జ‌న‌గాం 1 చొప్పున కేసులు న‌మోదు అయ్యాయి. ఇప్ప‌టి వర‌‌కు 1491 డిశ్చార్జి కాగా.. 1213 మంది ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఇదిలావుంటే తెలంగాణ‌లో మొదట్లో కేసుల సంఖ్య తగ్గుముఖం ఉన్నా.. ఢిల్లీ నిజాముద్దీన్‌ మర్కజ్‌ ఘటన తర్వాత దేశంలో కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో దేశంలో లాక్‌డౌన్‌ కఠినంగా అమలువుతుంది. అయినా కేసుల సంఖ్య మాత్రం పెరుగుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఫలితం లేకుండా పోతోంది.

TS corona cases rise to 2792

Next Story