పిడుగుపాటుకు 31 మంది మృతి

By సుభాష్  Published on  3 July 2020 4:46 AM GMT
పిడుగుపాటుకు 31 మంది మృతి

బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర బీభత్సం సృష్టిస్తున్నాయి. ఒక వైపు భారీ వర్షాల కారణంగా పలువురు మృత్యువాత పడుతుంటే మరోవైపు పిడుగుపాటుకు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఈ రెండు రాష్ట్రాల్లో గురువారం ఒక్క రోజే పిడుగుపాటుకు 31 మంది మృతి చెందారు. ఇక అసోంలో వదరల కారణంగా మరొకరు మృతి చెందారు. భారీ వర్షాల కారణంగా పంటపొలాలన్నీ నీటితో మునిగిపోయాయి. మరో వైపు ముంబైలో భారీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇక ఢిల్లీలో మాత్రం వాతావరణ పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. రాష్ట్రంలో తీవ్రమైన వేడి వాతావరణం ఉంది. మరో రెండు రోజుల పాటు ఇలాగే ఉంటుందని భాతర వాతావరణ శాఖ తెలిపింది.

కాగా, బీహార్‌లో గురువారం 26 మంది పిడుగుపాటుకుమృతి చెందినట్లు అధికారులు వెల్లడించారు. గత వారం కూడా రాష్ట్రలో పిడుగు పాటుకు 100 మందికిపైగా మరణించినట్లు చెప్పారు. అలా పాట్నాతోపాటు ఎనిమిది జిల్లాలో పిడుగు పాటుకు మృతి చెందారు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం అధికారులు తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కలిపి మొత్తం ఒక్క రోజే 31 మంది మృతి చెందడంతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల ఎక్స్‌ గ్రేషియా

కాగా, పిడుగుపాటుకు మృతి చెందిన కుటుంబాలకు బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే పిడుగుపాటకు మరణించిన కుటుంబాలకు నాలుగు లక్షల ఎక్స్‌ గ్రేషియా ప్రకటించారు. ఈ మొత్తాన్ని బాధిత కుటుంబ సభ్యులకు త్వరగా అందించాలని అధికారులను ఆదేశించారు.

Next Story
Share it