ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. రౌడీ మూకలు జరిపిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తప్పించుకుని తిరుగుతున్న రౌడీషీటర్‌ వికాస్‌దూబేను పట్టుకునేందుకు గత రెండు రోజుల నుంచి గాలింపు చర్యలు చేపడుతున్నారు. కాన్పూర్‌ సమీపంలోని అతడు నివాసం ఉంటున్న డిక్రూ గ్రామానికి అర్థరాత్రి వెళ్లారు. అయితే అతని నివాసానికి పో్లీసులు చేరుకుంటున్న క్రమంలో ఓ ఇంటిపై మాటు వేసిన దుండగులు పోలీసులపై కాల్పులు జరిపారు.

ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీదేవేంద్ర మిశ్రాసహా మొత్తం 8 మంది పోలీసులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు గాయపడ్డారు. అయితే 60 క్రిమినల్‌ కేసుల్లో వికాస్‌దూబే నిందితుడిగా ఉన్నట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, కాల్పులకు పాల్పడిన దుండుగలపై కఠిన చర్యలు తీసుకోవాలని డీపీజీని ఆదేశించారు. డీజీపీ, కాన్పూర్‌ ఐజీ సహా ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.