రాత్రి పూట భోజనం మానేస్తే బరువు తగ్గుతారా?
బాగా లావైనా, బరువు పెరిగినా.. తగ్గడం కోసం చాలా మందికి వచ్చే మొదటి ఆలోచన రాత్రి పూట భోజనం మానేయడం.
By - అంజి |
రాత్రి పూట భోజనం మానేస్తే బరువు తగ్గుతారా?
బాగా లావైనా, బరువు పెరిగినా.. తగ్గడం కోసం చాలా మందికి వచ్చే మొదటి ఆలోచన రాత్రి పూట భోజనం మానేయడం. రాత్రి డిన్నర్ మానేస్తే సులువుగా బరువు తగ్గుతామని చాలా మంది భావిస్తారు. ఇలా చేస్తే శరీరంలోకి కేలరీలు తక్కువగా చేరి సాధారణంగా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అయితే బరువు తగ్గడం కోసం రాత్రి పూట భోజనం పూర్తిగా మానేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రాత్రి భోజనం మానేయడం వల్ల కొందరికి తర్వాతి రోజు ఉదయం ఆకలి ఎక్కువై అతిగా తినడానికి ప్రేరిపిస్తుంది. దీని వల్ల రాత్రి తిండి మానేసిన ఫలితం దక్కదు.
సాయంత్రం వ్యాయామం చేస్తూ రాత్రి భోజనం మానేసిన వారిలో అలసట ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ రోజుల పాటు రాత్రి భోజనం మానేస్తే తలనొప్పి, చిరాకు పంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. జీవ క్రియలు కూడా నెమ్మదిగా జరుగుతాయి. కొందరికి అర్ధరాత్రి ఆకలి వేసి నిద్ర సరిగాపట్టదు. అందుకే రాత్రిపూట భోజనాన్ని పూర్తిగా మానేసే బదులు తక్కువగా తీసుకోండి. జంక్‌ఫుడ్, చక్కెర ఉన్న ఆహారం కాకుండా ప్రొటీన్స్, కూరగాయలతో కూడిన ఆహారం తీసుకోవాలి. ఈ విషయంలో అవకాశం ఉంటే నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.