వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే?

ఆహారంలో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్‌-సి ఎక్కువగా ఉండే బెర్రీలు, ఆరెంజ్‌, నిమ్మకాయలు, క్యాప్సికం లాంటివి ఆహారంలో భాగంలో చేసుకోవాలి.

By అంజి
Published on : 19 Aug 2025 11:13 AM IST

immunity boost, rainy season, Life style, Health Tips

వర్షాకాలంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలంటే?

ఆహారంలో తాజా కూరగాయలు, ఆకు కూరలు, పండ్లను భాగం చేసుకోవాలి. ముఖ్యంగా విటమిన్‌-సి ఎక్కువగా ఉండే బెర్రీలు, ఆరెంజ్‌, నిమ్మకాయలు, క్యాప్సికం లాంటివి ఆహారంలో భాగంలో చేసుకోవాలి.

గుడ్లు, శనగలు, పెసర్లు, చికెన్‌, పప్పులు, బీన్స్‌ వంటి వాటిలో ప్రొటీన్లు ఉంటాయి. ఇవి శరీరం ఎదుగుదలకు, శక్తికి కారణమై వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి.

జింక్‌ అధికంగా ఉండే గింజలు, విత్తనాలు, చిరు ధాన్యాలు తీసుకోవాలి. ఇవి రోగనిరోధక వ్యవస్థ పని తీరును పెంచుతాయి. పసుపులో ఉండే కుర్కుమిన్‌ శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్‌, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అందుకే పసుపును కూరలు, ఇతర ఆహార పదార్థాల్లో భాగం చేసుకోవాలి.

తులసి ఆకులలో యాంటీ వైరల్‌ మరియు యాంటీ బాక్టీరియల్‌ లక్షణాలున్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లకు నివారిస్తాయి. రోజూ ఉదయం 2 తులసి ఆకులను నమిలినా ఆరోగ్యానికి మంచిది. అల్లం కూడా రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

భోజనానికి ముందు, బాత్రూమ్‌కు వెళ్లి వచ్చిన తర్వాత తప్పనిసరిగా చేతులను శుభ్రం చేసుకోవాలి. దీని వల్ల బ్యాక్టీరియా, వైరస్‌ల వ్యాప్తిని నివారించవచ్చు.

Next Story