యాపిల్ పండులో అనేక పోషకాలు, విటమిన్లు ఉంటాయి. రోజూ ఒక యాపిల్ తినడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడి కాంతివంతంగా మారుతుంది. యాపిల్‌లో విటమిన్ ఎ, బి కాంప్లెక్స్, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మం మీద సూక్ష్మక్రిములు, అదనపు నూనెను తొలగించడంలో సహాయపడతాయి. ఈ పండులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడతాయి. వృద్ధాప్య సంకేతాలను తగ్గిస్తుంది. ముఖం మీద మొటిమలు, నల్ల మచ్చలను తగ్గిస్తుంది.
రోజూ యాపిల్ తింటూ చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. సూర్యుడి నుంచి వెలువడే హానికర యూవీ కిరణాల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. కళ్ల కింద నల్లటి వలయాలను తగ్గిస్తుంది. యాపిల్‌ను బాగా మిక్స్ చేసి వచ్చే జ్యూస్‌లో కాటన్ బాల్‌ను అద్ది ముఖం అంతటా అప్లై చేయాలి. ఇలా కాసేపు ఉంచాలి. ముఖం పూర్తిగా ఆరిన తర్వాత నీటితో ఫేస్ క్లీన్ చేసుకోవాలి. ఇలా వారంలో 2, 3 రోజులు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుందని సౌందర్య నిపుణులు సూచిస్తున్నారు.