ఇవి తింటే మీ ఆయుష్షు పెరుగుతుంది.!

These food increases your life span. నిండూ నూరేళ్లు బతకాలని మన పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ వాళ్లు అశీర్వదిస్తే సరిపోదు కదా.. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం

By అంజి  Published on  30 Oct 2021 8:43 AM GMT
ఇవి తింటే మీ ఆయుష్షు పెరుగుతుంది.!

నిండూ నూరేళ్లు బతకాలని మన పెద్దలు ఆశీర్వదిస్తుంటారు. కానీ వాళ్లు అశీర్వదిస్తే సరిపోదు కదా.. మంచి పౌష్టిక ఆహారం తీసుకోవడం మూలంగానే ఆయుష్షును పొడిగించుకోవచ్చు. పోషకాలు, ప్రోటీన్స్‌తో కూడిన ఆహారం తినడం వల్ల ఎక్కువ కాలం జీవించొచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఆకు కూరలు తినడం వల్ల దీర్ఘ కాలిక వ్యాధులకు చెక్‌ పెట్టవచ్చు. బచ్చలి కూరలు అత్యంత పోషకమైన ఫుడ్‌లో ఒకటి. వీటిలో అధిక ఉత్తమ పోషకాలు ఉన్నట్లు పోషకాహార అధ్యయనంలో తేలింది. అలాగే ఎక్కువగా ప్రజాదరణ పొందిన స్నాక్స్‌లో ఒకటైన ఓట్స్‌ తినే వారిలో చెడు కొలెస్ట్రాల్‌, శరీర బరువు తక్కువగా ఉన్నట్లు తేలింది. ఓట్మిల్‌ ఆహారం దీర్ఘాయుష్షుతో సంబంధం కలిగి ఉంది. దీన్ని 6 వారాల పాటు ఓట్స్‌ తినడం ద్వారా పరిశోధకులు గుర్తించారు.

కార్బోహైడ్రేట్లు సైతం మనిషి ఎక్కువ కాలం జీవించేందుకు తోడ్పడతాయి. తాజా అధ్యయనాల్లో తృణధాన్యాలు తీసుకోవడం వల్ల ఆయుష్షు పెరుగుతుందని తేలింది. అమెరికాలో రోజుకు కనీసం రెండు, మూడు సేర్విన్గ్స్‌ తృణధాన్యాలు తినడం మంచి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమని తేలింది. యునైటేడ్‌ స్టేట్స్‌ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ యాంటీ ఆక్సిడెంట్లపై అధ్యయం చేసింది. ఈ అధ్యయనంలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఫుడ్‌ను తీసుకోవడం వల్ల దీర్ఘాయువుకు తోడ్పడుతుందని గుర్తించింది. ఎక్కువ కాలం జీవించేందుకు ఓట్‌మిల్‌లో అధికంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న కొన్ని బ్లూబెర్రీస్‌ కలిపి తినండి. దీని వల్ల మీ జీవిత కాలాన్ని పొడిగించుకోవచ్చు.

Next Story