వాకింగ్, రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా మంచిది. మనం రోజు వారీ సులువుగా చేసే వ్యాయామాల్లో వాకింగ్ ఒకటి.
By అంజి Published on 5 Dec 2024 7:23 AM IST
వాకింగ్, రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు
శారీరక, మానసిక ఆరోగ్యానికి వ్యాయామం చాలా మంచిది. మనం రోజు వారీ సులువుగా చేసే వ్యాయామాల్లో వాకింగ్ ఒకటి. దీనికి వయసు, ఫిట్‌నెస్‌తో సంబంధం ఉండదు. రన్నింగ్‌లా కాకుండా వాకింగ్ కీళ్ల మీద తక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్ సమస్యలు ఉన్న వాళ్లకు వ్యాయామంగా నడక మంచి ఎంపిక. రోజూ కనీసం 30 నిమిషాల పాటు కాస్త వేగంగా నడవడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉంటుంది. గుండెకు మేలు జరుగుతుంది.
వాకింగ్ వల్ల ఒత్తిడి, ఆందోళన, కుంగుబాటు తగ్గి మెదడు పనితీరు మెరుగుపడుతుంది. వాకింగ్‌తో పోలిస్తే రన్నింగ్ కొంచెం కష్టమైన వ్యాయామం. దీన్ని అన్ని వయసుల వారు సులభంగా చేయలేరు. దీనికి కాస్త ఫిట్‌నెస్ అవసరం. వాకింగ్ కంటే రన్నింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. వాకింగ్‌తో పోలిస్తే రన్నింగ్‌తో ఎక్కువ క్యాలరీలు కరుగుతాయి. దీని వల్ల అధిక బరువు సమస్య తగ్గి ఫిట్‌నెస్ మెరుగుపరుచుకోవచ్చు.
రన్నింగ్ వల్ల గుండె, ఊపిరితిత్తులు బలోపేతమై శ్వాస వ్యవస్థ సామర్థ్యం పెరుగుతుంది. రన్నింగ్ వల్ల ఎముకల సాంద్రత పెరుగుతుంది. రన్నింగ్ వల్ల శరీరంలో ఒత్తిడిని తగ్గించే ఎండార్ఫిన్లు విడుదల అవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యానికి కారణమవుతాయి. అయితే మన ఫిట్‌నెస్ లక్ష్యాలు, శారీక సామర్థ్యాన్ని బట్టి వాకింగ్ చేయాలా, రన్నింగ్ చేయాలా అనేది ఎంచుకోవాలి. దీని కోసం నిపుణుల సలహా తీసుకోవడం ఉత్తమం.