ఏడాదిలో 300 రోజులు ఫూల్ మఖానా తింటానని ప్రధాని మోదీ నిన్న చెప్పిన విషయం తెలిసిందే. ఫుల్ మఖానా అంటే తనకు ఎంతో ఇష్టమని ప్రధాని చెప్పారు. ఇది ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనమని చెప్పారు. బిహార్‌లోని భాగల్‌పూర్‌లో నిన్న ప్రధాని మోదీ మాట్లాడారు. దేశంలో చాలా మంది బ్రేక్‌ఫాస్ట్‌లో మఖానా తింటున్నారని, దీన్ని ఉత్పత్తి మరింత పెరగాలన్నారు.
మరి ఈ సూపర్ ఫుడ్ తీసుకుంటే కలిగే లాభాలు ఎంటో ఇప్పుడు చూద్దామా?
- ఫూల్ మఖానాలో క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ ఉంటయి.
- ఫూల్ మఖానాలోని యాంటీ ఆక్సిడెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను బ్యాలెన్స్ చేసి, టైప్-2 డయాబెటిస్‌కు అడ్డుకట్ట వేస్తాయి.
- ఫూల్ మఖానాలోని ఫైబర్ ఆకలిని తగ్గించి, బరువు పెరగకుండా చేస్తుంది.
- ఫూల్ మఖానాలోని అమినో యాసిడ్స్ చర్మంపై మడతలు, మొటిమల్ని తగ్గిస్తాయి.
ఫూల్ మఖానా ఎలా తయారు చేస్తారు
ఫూల్ మఖానా తామర గింజలతో తయారు చేస్తారు. బురదలో పెరిగే తామర మొక్కల కింద ఈ గింజలు ఉంటాయి. వాటి సేకరణ చాలా కష్టంతో కూడుకున్నది. సేకరించిన తామర గింజలను ఎండబెడతారు. అనంతరం వాటిని కాల్చడంతో మఖానాగా మారుతాయి. ఉత్పత్తి తక్కువతో పాటు ఈ మొత్తం ప్రాసెస్‌కు చాలా సమయం పడుతుంది. అందుకే మఖానా రేట్ ఎక్కువ ఉంటుంది. మార్కెట్‌లో కిలో ఎక్కువ ఉంటుంది. మార్కెట్‌లో కిలో రూ.1400 నుంచి రూ.2 వేల వరకు పలుకుతుంది.