సీఎస్‌సీతో టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కీలక భాగస్వామ్యం
TATA AIA Life Insurance partners with CSC. గ్రామీణ ప్రాంత వాసులకు అవసరమైన భీమా రక్షణను అందించడంతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు
By Medi Samrat Published on 19 April 2022 5:15 PM ISTగ్రామీణ ప్రాంత వాసులకు అవసరమైన భీమా రక్షణను అందించడంతో పాటుగా వారి కుటుంబ సభ్యులకు జీవితపు ఒడిదుడుకుల వేళ తగిన మద్దతునందించడంలో భాగంగా భారతదేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భీమా సంస్థలలో ఒకటైన టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్.. ఇప్పుడు భారత ప్రభుత్వ ఎలకా్ట్రనిక్స్– ఐటీ మంత్రిత్వశాఖ పరిధిలోని కామన్ సర్వీస్ సెంటర్స్ (సీఎస్‌ఈ)తో భాగస్వామ్యం చేసుకుంది.
ఈ భాగస్వామ్యం ద్వారా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్స్ దాదాపుగా 95% గ్రామ పంచాయతీలను చేరుకోవడంతో పాటుగా భారత్‌లోని మారుమూల ప్రాంతాలను సైతం చేరుకోనుంది. ఈ నెట్‌వర్క్ ద్వారా సీఎస్‌సీ ఇప్పుడు టాటా ఏఐఏ లైఫ్ పీఓఎస్ స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్ ప్లాన్‌ను అందించనుంది. ఇది జీవిత భీమాతో పాటుగా పొదుపును సైతం అందించనుంది. ఈ ప్లాన్ ఇప్పుడు రెగ్యులర్ ఇన్‌కమ్ బెనిఫిట్ అవకాశం కింద వార్షిక ప్రీమియంపై 120% గ్యారెంటీడ్ పేఔట్స్ అందిస్తుంది. ఈ ప్లాన్ కింద 24,97,000 రూపాయల హామీ మొత్తం పొందవచ్చు. ఏడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లిస్తే 15 సంవత్సరాల జీవిత కవరేజీని వినియోగదారులు పొందవచ్చు. మహిళా పాలసీహోల్డర్లు మరింత అధిక ప్రయోజనాలను పొందవచ్చు.
ఈ సందర్భంగా టాటా ఏఐఏ లైఫ్ ఇన్సూరెన్ప్ చీఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫీసర్ అండ్ హెడ్ ఆఫ్ మార్కెటింగ్ వెంకీ అయ్యర్ మాట్లాడుతూ '' ప్రస్తుతం, జీవిత భీమా గ్రామీణ భారతదేశంలో 8–10% మందికి మాత్రమే చేరుకుంది. ప్రతి కుటుంబానికి జీవిత భీమాను చేరువచేయాలనేది మా ప్రయత్నం. సీఎస్‌సీ యొక్క సాంకేతికాధారిత పంపిణీ నెట్‌వర్క్ దేశవ్యాప్తంగా వ్యాపించి ఉంది. ఈ సంస్ధ సహాయంతో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను గ్రామీణ భారత రక్షణ, పొదుపు కోసం అందించనున్నాం'' అని అన్నారు.
సీఎస్‌సీ ఈ–గవర్నెన్స్ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దినేష్ కుమార్ త్యాగి మాట్లాడుతూ ''దాదాపు 2014నుంచి సీఎస్‌సీ భీమా సేవలను ప్రజలకు అందిస్తుంది. టాటా ఏఐఏ భీమా భాగస్వామ్యంతో మేము టాటా ఏఐఏ లైఫ్ పీఓఎస్ స్మార్ట్ ఇన్‌కమ్ ప్లస్ ప్లాన్ లాంటివి జోడించాము. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంత ప్రజలు ఇప్పుడు ఈ భీమా సేవలను తమ దగ్గరలోని సీఎస్‌సీ వద్ద పొందవచ్చు'' అని అన్నారు.