మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల అజీర్తి, గ్యాస్ సమస్యలు పెరుగుతాయి. అవేంటో చూద్దాం..
ఎక్కువ ఫ్రై చేసిన ఆహార పదార్థాలు, కొవ్వు ఎక్కువగా ఉండే మంసాహారం, నూనెతో చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినడం వల్ల.. అజీర్తి, కడుపులో గ్యాస్ సమస్య తలెత్తుతుంది.
కొందరికి కాఫీ, టీలను రోజులో ఎక్కువ సార్లు తాగే అలవాటు ఉంటుంది. వీటిలో ఉండే కెఫిన్ అజీర్తి, కడుపులో గ్యాస్ సమస్యలను ఎక్కువ చేస్తుంది. అందుకే కాఫీ లేదా టీని రోజులో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే తాగడం మంచిది.
ఆరెంజ్, బత్తాయి, ద్రాక్ష వంటి వాటిని మరీ ఎక్కువగా తినొద్దు. టమాటోను కూడా కూరల్లో పరిమితంగా వేసుకోవాలి. వీటిని ఎక్కువగా తీసుకుంటే కడుపులో ఆమ్లాల ఉత్పత్తి పెరిగి కడుపు మంట, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి.
పాలు, పెరుగు, ఇతర పాల ఉత్పత్తులు లాక్టోస్ సమస్య ఉన్న వారిలో అజీర్తిని, గ్యాస్ సమస్యను పెంచుతాయి. కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్, సోడా వంటివి తాగినప్పుడు అజీర్తి సమస్య తగ్గినట్టు భావిస్తారు. అయితే వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కడుపులో గ్యాస్ సమస్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.