మనలో ఒత్తిడి పెరగడం వల్ల.. భయం, ఆందోళన, మహిళల్లో నెలసరి సమస్యలు, ఊబకాయం, నిద్రలేమి, అల్జీమర్స్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రయత్నాలతో ఈ ఒత్తిడి నుంచి ఈజీగా బయటపడొచ్చు.
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు నడవాలి. పచ్చని ప్రకృతిలో ఎక్కువ సమయం గడిపితే ఒత్తిడి నుంచి సులభంగా బయటపడొచ్చు. దీని కోసం సమయం దొరికినప్పుడు దగ్గరలో చెట్లు ఎక్కువగా ఉండే పార్కుల్లో కాసేపు గడపాలి.
రాత్రి వేళ కచ్చితంగా రోజుకు 8 గంటల పాటు పడుకోవాలి. మంచి నిద్ర మనలో ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉద్యోగం చేసేవారు ఆఫీసులో పనిచేసేటప్పుడు తప్పనిసరిగా ప్రతి 2, 3 గంటలకు ఒకసారైన పని నుంచి కొన్ని నిమిషాల పాటు విరామం తీసుకోవాలి.
ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది. ప్రతి రోజూ యోగా, ధ్యానం వంటివి చేయాలి. ఈ ప్రయత్నాలు మనలో ఒత్తిడిని తగ్గించేందుకు దోహదపడతాయి.