నానబెట్టిన నట్స్‌తో ఆరోగ్యం పదిలం

ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్.

By -  అంజి
Published on : 5 Jan 2026 11:20 AM IST

health benefits, eating, soaked nuts, Lifestyle

నానబెట్టిన నట్స్‌తో ఆరోగ్యం పదిలం 

ఉదయాన్నే చాలా మంది నీటిలో నానబెట్టిన గింజలు తింటారు. టేస్ట్ కాస్త తేడాగా ఉన్న వీటిని తినడం వల్ల ఉండే లాభాలు మాత్రం వేరే లెవెల్. అవేంటో తెలుసుకుంటే మీరు కూడా రేపటి నుంచే ప్రారంభిస్తారు.

-నానబెట్టిన గింజలను ఉదయాన్నే పరగడుపునే తినాలి. అప్పుడే అందులో ఉండే పోషకాలు పూర్తి స్థాయిలో శరీరానికి అందుతాయి.

-వీటిని తింటే ఎనర్జీగా పొందడమే కాకుండా.. రోజంతా యాక్టివ్‌గా కనిపిస్తారు.

-వీటిలో ఉన్న ఐరన్‌, క్యాల్షియం, జింక్‌ వంటి ముఖ్యమైన పోషకాలన్నీ శరీరం సులభంగా గ్రహించగలుగుతుంది. దీంతో శరీరానికి శక్తి లభిస్తుంది.

-వీటిని తినడం వల్ల రెట్టింపు ఎనర్జీ రావడమే కాకుండా.. మార్మోన్లు సరిగ్గా విడుదల అవుతాయి.

-నానబెట్టిన బాదం పలుకులు ఉదయాన్నే తింటే.. బాడీలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతే కాకుండా జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

- బరువు తగ్గేందుకు ప్రయత్నించేవాళ్లు వాల్‌నట్స్, పిస్తాపలుకు నీళ్లలో నానబెట్టుకుని ఉదయాన్నే తింటే మంచి ఫలితం ఉంటుంది.

-బ్లడ్‌లో షుగర్ లెవెల్స్ కంట్రోల్‌లో ఉండేందుకు నట్స్ ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా డయాబెటిక్ రోగులు ఈ నట్స్ నానబెట్టుకుని తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

అయితే ఇన్ని పోషకాలు ఉన్న నట్స్.. ఎక్కువగా తినడం కూడా మంచి కాదంటున్నారు న్యూట్రిషన్స్. వారానికి 10 బాదం పలుకులు, 5 వాల్‌నట్స్‌, ఒక గుప్పెడు పిస్తా పలుకులు, 5 జీడిపప్పు పలుకులను తినొచ్చని చెప్తున్నారు.

Next Story