పచ్చి కొబ్బరిని సాధారణంగా చట్నీల తయారీతో పాటు ఇతర వంటకాల్లో ఉపయోగిస్తారు. కొందరు బెల్లం, చక్కెరతో ఉండల తయారీలోనూ వాడతారు. అయితే మరికొందరు వీటిని పచ్చిగా తినడానికి ఇష్టపడతారు. అయితే పచ్చికొబ్బరి తింటే శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగి బరువు పెరుగుతారనే సందేహం కొందరిలో ఉంది. అయితే అది అపోహ మాత్రమే అని, పచ్చి కొబ్బరిని ప్రతి రోజూ కొద్ది మొత్తంలో తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
పచ్చి కొబ్బరితో శరీరంలో మంచి కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మంచిది. పచ్చి కొబ్బరిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణక్రియ ప్రక్రియను వేగవంతం చేయడానికి సాయపడుతుంది. పచ్చి కొబ్బరిలో ఉండే పోషకాలు థైరాయిడ్‌ను తగ్గిస్తాయి. తరచూ పచ్చి కొబ్బరిని కొద్ది మొత్తంలో తింటే మెదడు చురుగ్గా పని చేసి మతి మరుపు సమస్యలు రాకుండా ఉంటాయి.
పిల్లలకు బెల్లం, పచ్చి కొబ్బరితో చేసిన పదార్థాలు ఇస్తే రక్త హీనత సమస్య తగ్గుతుంది. చిన్న వయసులోనే ఎముకలు, కండరాలు గట్టిపడతాయి. పచ్చి కొబ్బరి తరచూ తినడం వల్ల చర్మం, కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి. జుల్లు రాలే సమస్య తగ్గుతుంది.