పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగడానికి రోజూ ఒక ఉడకబెట్టిన గుడ్డును వారికి ఇవ్వాలి. దీని వల్ల విషయ గ్రహణ సామర్థ్యంతో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. ఉదయం తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్ అందించాలి. ఇది రోజంతా జీవ క్రియలు సక్రమంగా జరిగేందుకు తోడ్పడి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరగడానికి సాయపడుతుందని పలు అధ్యయనాల్లో తేలింది. చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాట్ ఆమ్లాలు మెదడు ఆరోగ్యానికి కారణం అవుతాయి. జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను పెంచి అల్జీమర్స్ ముప్పును తగ్గిస్తాయి.
బాదం, పిస్తా, వాల్‌నట్స్, జీడిపప్పు, ఎండుద్రాక్షలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఇవి మెదడులో కణాల పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తి పెరగడానికి కారణమవుతాయి. బ్రొకలీ, నేరేడు, స్ట్రాబెర్రీస్, రేగుపండ్లు, ఉల్లి, వెల్లుల్లి, అవకాడల్లో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమెటరీ గుణాలు ఉన్నాయి. ఇవి మెదడు పనితీరును మెరుగుపరిచి జ్ఞాపకశక్తి మెరుగుపడేలా చేస్తాయి. గ్రీన్ వెజిటేబుల్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడప్పుడూ డార్క్ చాక్లెట్ తిన్నా మెదడు పనితీరు బాగుంటుంది. అలాగే ప్రతిరోజూ చిన్నారులు రాత్రి వేగంగా నిద్రపోతే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.