ప్రతి రోజూ వాకింగ్ చేస్తే.. ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది వాకింగ్.
By అంజి
ప్రతి రోజూ వాకింగ్ చేస్తే.. ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?
ప్రతి రోజూ కనీసం 30 నిమిషాల పాటు చేసే వ్యాయామం మన ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామంలో ఏ వయసు వారైనా చేయడానికి అనుకూలంగా ఉండేది వాకింగ్. రోజూ అరగంట పాటు కొంచెం వేగంగా నడిస్తే అది మనకు మేలు చేస్తుంది. కొందరు బరువు తగ్గాలని వాకింగ్ మొదలు పెడతారు. కానీ బరువు తగ్గడం లేదని చివరకు పక్కన పెడతారు. అలాంటి వారు కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలని ఫిట్‌నెస్ నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం..
నడిచేటప్పుడు చేతులను బలంగా, వేగంగా ముందుకు, వెనక్కు ఊపుతూ నడవాలి. దీని వల్ల కేలరీలు బర్న్ అవ్వడంతో పాటు గుండె ఆరోగ్యం బాగుంటుంది.
మనం 30 నిమిషాల పాటు వాకింగ్ చేయాలనుకుంటే ఫస్ట్ ఒక నిమిషం వేగంగా నడిచి తర్వాత 2 నిమిషాలు నెమ్మదిగా నడవాలి. మళ్లీ ఒక నిమిషం స్పీడ్ వాకింగ్ మళ్లీ 2 నిమిషాలు స్లో వాకింగ్.. ఇలా చేయడం వల్ల కేలరీలు బర్న్ అయ్యి ఫిట్‌నెస్ మెరుగవుతుంది.
అవకాశం ఉండి సౌకర్యంగా ఉంటే చదునుగా ఉండే నేలపై నడిచే కంటే.. కొండ ప్రాంతంలా ఉన్న ప్రదేశంలో నడవడం వల్ల ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
వాకింగ్ వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందాలి అనుకునేవారు కొంచెం బరువుగా ఉండే వస్తువులను పట్టుకుని నడవాలి. దీని వల్ల కేలరీలు ఎక్కువగా బర్న్ అవ్వడంతో పాటు కండరాలు బలంగా మారతాయి. అయితే ఎక్కువ బరువున్న వస్తువులు తీసుకెళ్లొద్దు.
వాకింగ్ చేసేటప్పుడు మరీ నెమ్మదిగా కాకుండా కాస్త వేగంగా నడవడం ఉత్తమం. అలాగని మరీ వేగంగా వద్దు. దీని వల్ల అలసటతో పాటు కండరాల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది.
వాకింగ్ చేసేటప్పుడు హైడ్రేట్‌గా ఉండాలి. అందుకే వాకింగ్‌కు కొన్ని నిమిషాల ముందు, పూర్తైన కొన్ని నిమిషాల తర్వాత నీరు తాగాలి. మధ్య మధ్యలో దాహంగా అనిపిస్తే కాసేపు విశ్రాంతి తీసుకుని కొద్దిగా నీరు తాగి మళ్లీ ప్రారంభించాలి.
వాకింగ్ చేసేటప్పుడు సౌకర్యంగా ఉండే షూస్ ధరించాలి. మరీ టైట్‌గా ఉంటే గాయాలు కావడం, మోకాళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. వాకింగ్ చేసేటప్పుడు రోజూ మీరు నడిచిన సమయంలో ఎన్ని అడుగులు వేశారో లెక్కపెట్టండి. దీని వల్ల తర్వాతి రోజు అంతకంటే ఎక్కువ వేయడానికి ప్రయత్నిస్తారు.