తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా?.. ఒక్క నిమిషం ఈ విషయం తెలుసుకోండి

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను వదిలేస్తున్నారు.

By -  అంజి
Published on : 26 Jan 2026 2:20 PM IST

drink water, eating, Lifestyle, Health Tips

తినేటప్పుడు నీళ్లు తాగుతున్నారా?.. ఒక్క నిమిషం ఈ విషయం తెలుసుకోండి 

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో చాలా మంది సంప్రదాయంగా ఎన్నో ఏళ్ల నుంచి వస్తున్న కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను వదిలేస్తున్నారు. భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. అయినప్పటికి చాలా మంది అన్నం తింటున్నప్పుడూ నీళ్లు తాగుతుంటారు. అయితే ఇలా చేయడం వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

భోజన సమయంలో ఎక్కువగా నీళ్లు తాగితే లేనిపోని అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. అలాగని భోజనానికి ముందు నీరు తాగితే శరీరం బలహీనంగా మారిపోతుంది. అలాగే వెంటనే నీరు ఎక్కువగా తాగిన అది స్థూలకాయానికి దారితీస్తుంది.ఇక భోజన సమయంలో అదే పనిగా నీళ్లు ఎక్కువగా తీసుకోవడం వల్ల జీర్ణాశయంలో విడుదలైన జీర్ణరసాలు పలుచబడి పోయే అవకాశం ఉంది. దీంతో ఆహారం జీర్ణం అయ్యేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉంది.తద్వారా తేన్పులు,అజీర్తి, కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యల ముప్పు పొంచి ఉంటుంది.

భోజన సమయంలో నీరు తాగేప్పుడు కొన్ని మార్గాలు అనుసరించాల్సి ఉంటుంది. భోజనం చేసే సమయంలో ఒకేసారి నీరు తాగకుండా సీప్ చేస్తున్నట్లుగా కొద్దికొద్దిగా తాగాలి. ఇలా తీసుకున్న నీరు మనం తీసుకున్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి సహాయపడుతుంది. అలాగే వెచ్చని నీటిని కూడా భోజనం చేసేప్పుడు తీసుకుంటే శరీరంలో జీర్ణక్రియ త్వరగా జరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Next Story