తిన్న తర్వాత 10 నిమిషాలు ఆగి కాసేపు నడవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది.
తిన్న తర్వాత కూలింగ్ వాటర్ కాకుండా గోరువెచ్చని నీరు లేదా సాధారణ నీళ్లు తాగడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. తిని బాగా చల్లని నీరు లేదా కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల ఆహారం అంత వేగంగా జీర్ణంకాదు.
భోజనం తర్వాత సోంపు గింజలను నమలడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం అవడమే కాకుండా కడుపు ఉబ్బర సమస్య తగ్గుతుంది.
తిన్న వెంటనే పడుకోవద్దు. దీని వల్ల గుండెలో మంట, కడుపులోని ఆమ్లం పైకి వచ్చి యాసిడ్ రిఫ్లక్స్ సమస్య తలెత్తవచ్చు. దీనికి బదులుగా కాసేపు నడిచి నిటారుగా కూర్చోవాలి.
నిదానంగా, లోతైన శ్వాస తీసుకోవడం వల్ల జీర్ణక్రియ చక్కగా జరుగుతుంది.
తిన్న తర్వాత కొందరు టీ, కాఫీలు తాగుతుంటారు. ఆహారంలో పోషకాలను శరీరం గ్రహించకుండా టీ, కాఫీలు అడ్డుకుంటాయి. తిన్న తర్వాత సిగరెట్లు కాల్చకూడదు. ఈ అలవాటు ఉన్నా మానుకోవాలి.