బ్రౌన్ రైస్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలిస్తే తినడం ఆపరు
బ్రౌన్ రైస్ అనగానే ప్రత్యేకంగా వాటిని పండిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ ... సాధారణ బియ్యాన్నే ప్రాసెస్ చేయకుండా..
By - అంజి |
బ్రౌన్ రైస్‌తో ఎన్నో ప్రయోజనాలు.. ఈ విషయాలు తెలిస్తే తినడం ఆపరు
బ్రౌన్ రైస్ అనగానే ప్రత్యేకంగా వాటిని పండిస్తారని అనుకుంటారు చాలా మంది. కానీ ... సాధారణ బియ్యాన్నే ప్రాసెస్ చేయకుండా అమ్మేవే బ్రౌన్ రైస్. ఇప్పుడు మనం తింటున్న వైట్ రైస్ బాగా రిఫైన్ చేసి, ప్రాసెస్ చేసినవి. అందుకే తెల్ల అన్నంతో పోలిస్తే బ్రౌన్ రైస్‌లో పోషకాలు ఎక్కువ. ఎమినో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్, మెగ్నీషియం, కాల్షియం వంటి మినరల్స్ బ్రౌన్ రైస్‌లో సమృద్ధిగా లభిస్తాయి.ఇవి బోన్స్ ని హెల్తీగా అలాగే స్ట్రాంగ్‌గా ఉంచేందుకు తోడ్పడతాయి.
దీంతో ఆస్టియోపొరోసిస్ వంటి వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చు. బ్రౌన్ రైస్‌లో లభించే ఫైబర్, యాంటి ఆక్సిడెంట్‌లకి ఆర్టరీస్‌లో పేరుకున్న ప్లేగ్‌ను తొలగించే సామర్థ్యం ఉంది. దీంతో గుండెకి రక్తసరఫరా మెరుగ్గా జరుగుతుంది. ఆ విధంగా..గుండె జబ్బులను అరికట్టవచ్చు. శరీరంలోని క్యాన్సర్ కారక కణాలు వృద్ధి చెందుతున్నప్పుడు అవి శరీరంలోని అవయవాలను అలాగే టిష్యూలను డిస్ట్రాయ్ చేస్తాయి. బ్రౌన్ రైస్‌లో లభించే యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాన్సర్ కారక కణాల వృద్ధి అరికట్టబడుతుంది.
డయాబెటిస్ అనేది సాధారణ మెటబాలిక్ డిజార్డర్.ఇటీవల కాలంలో ఈ డిజార్డర్‌కు గురయ్యేవారి సంఖ్య పెరుగుతూ ఉంటోంది. ఇన్సులిన్ అనే హార్మోన్ ని శరీరం తగినంతగా ఉత్పత్తి చేయకపోతే బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి అమాంతం పెరుగుతాయి. దీంతో.. అనేక అవాంఛిత ప్రభావాలు శరీరంపై పడతాయి. బ్రౌన్ రైస్ అనేది ఫైటిక్ యాసిడ్, ఫైబర్‌లను న్యూట్రియెంట్స్ ని పుష్కలంగా కలిగి ఉంటుంది.ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని సమర్థవంతంగా తగ్గించి డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
బ్రౌన్‌రైస్‌లో ఉండే విటమిన్లు, ఖనిజాలతో పాటు ఇతర పోషకాలు రోగనిరోధక శక్తిని అందిస్తాయి. ఇవి శరీరంలో పేరుకున్న ఫ్రీ రాడికల్స్‌ని, వ్యర్థాలనూ బయటకు పంపిస్తాయి. అలాగే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. నిత్యం యవ్వనంగా కనిపించేందుకు ఇవి దోహదపడతాయి.