కాలేయ సంబంధిత వ్యాధులు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. మన శరీరంలోని కొవ్వును విచ్ఛిన్నం చేసి శక్తిని సృష్టించడం కాలేయం పని. కొవ్వు ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తింటే కాలేయంపై ఒత్తిడి పెరిగి దాని పని తీరులో మార్పు వస్తుంది. స్వీట్లను ఎక్కువగా తినడం భవిష్యత్తులో కాలేయ వ్యాధికి కారణం కావొచ్చు. వెన్న ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే కాలేయ సమస్యలు పెరుగుతాయి.
ప్రాసెస్ చేసిన మాసం, చీజ్ బర్గర్‌లలో కొవ్వు అధికంగా ఉంటుంది. ఇవి ఎక్కువగా తీసుకోవడం కాలేయానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని కూడా ఇవి పెంచుతాయట. ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుంది. కాలేయ సంరక్షణ కోసం తాజా కూరగాయలు, పండ్లు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ఉత్తమం. ఫ్రెంచ్ ఫ్రైస్ లేదా ఫ్రైడ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోకపోవడం మంచిది.