ప్రతి రోజూ కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేస్తే ఆరోగ్యానికి చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతారు. అయితే ప్రతి రోజూ కనీసం 11 నిమిషాలు వేగంగా నడిస్తే అకాల మరణం ముప్పు తగ్గుతుందని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి అకాల మృత్యువు అవకాశం ఎక్కువ. అందుకే రోజులో కనీసం 11 నిమిషాలు వేగంగా నడిస్తే గుండె సమస్యలు, డయాబెటిస్, అధిక బ రువు, అధిక రక్తపోటు ముప్పు తగ్గుతుంది.
అలాగే మెదడు పని తీరు మెరుగుపడుతుంది. ఎవరైతే ప్రతిరోజూ వాకింగ్ చేస్తారో వారికి ఆరోగ్య సమస్యలు తక్కువగా రావడంతో పాటు ఆయుష్షు కూడా పెరిగినట్టు అధ్యయనం పేర్కొంది. 11 నిమిషాలు వేగంగా నడవడం వల్ల బరువు తగ్గడంతో పాటు గుండెకు రక్త ప్రసరణ పెరిగి.. ఇతర అవయవాలకు ఆక్సిజన్, ఇతర పోషకాల సరఫరా పెరుగుతుంది. దీని వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటాయని తేలింది. అలాగే ఒత్తడి తగ్గడంతో పాటు టైప్ - 2 డయాబెటిస్ వచ్చే ముప్పు తగ్గుతుందని అధ్యయనం వెల్లడించింది.