భారత్‌లో కొనసాగుతున్న కరోనా విజృంభణ
By తోట వంశీ కుమార్ Published on 21 Sep 2020 5:14 AM GMTదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24గంటల్లో 86,961 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,130 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 54,87,581కి చేరింది. ఈ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 43,96,399 మంది కోలుకున్నారు. 10,03,299 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ వైరస్ బారిన పడి ఇప్పటి వరకు 87,882 మంది మరణించారు.
దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నప్పటికి రికవరీ అవుతున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతోంది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 79.68శాతం ఉండగా.. మరణాల రేటు 1.61శాతంగా ఉంది. నిన్న ఒక్కరోజులోనే 7,31,534 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా ఇప్పటి వరకు 6,43,92,594 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది. 70లక్షల పాజిటివ్ కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉంది.