నూతన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 Sep 2020 9:56 AM GMT
నూతన వ్యవసాయ బిల్లులకు రాజ్యసభ ఆమోదం

వ్యవసాయ రంగంలో సంస్కరణలకు ఉద్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ బిల్లుకు రాజ్యసభ ఆమోదం లభించింది. ఈ బిల్లుకే కాకుండా దీని అనుబంధ వ్యవసాయ బిల్లులకు కూడా ఆమోదం లభించింది. విపక్షణాల ఆందోణల మధ్య మూజువాణి ఓటుతో బిల్లులు ఆమోదం పొందినట్లు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా విపక్షాలు ప్రేవేశపెట్టిన సవరణ తీర్మానాలు వీగిపోయాయి. ఈ బిల్లులకు బీజేపీ, బీజేడీ, వైసీపీ, టీడీపీ, అన్నాడీఎంకే పార్టీలు మద్దతు పలకగా.. కాంగ్రెస్‌, తెరాస శిరోమణి అకాలీదళ్‌ సహా 14 పార్టీలు వ్యతిరేకించాయి. బిల్లుల ఆమోదం అనంతరం సభను రేపటికి వాయిదా వేశారు.

ఫార్మర్స్‌ ప్రొడ్యూస్‌ ట్రేడ్‌ అండ్‌ కామర్స్‌ బిల్లు, ఫార్మర్స్‌ అగ్రిమెంట్‌ ఆన్ ప్రైస్‌ అస్యూరెన్స్‌ అండ్ ఫార్మర్స్‌ సర్వీసు బిల్లులకు ఇప్పటికే లోకసభ ఆమోదం తెలుపగా.. ఇప్పుడు రాజ్యసభ ఆమోదం కూడా పొందాయి. ఇక, కార్పొరేట్ పెద్దలకు రైతులను గులాములుగా మార్చేందుకు ప్రధాని మోడీ ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు రాహుల్ గాంధీ. వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ.. రాహుల్ ట్వీట్ చేశారు. రైతులకు వ్యతిరేకంగా తీసుకొస్తున్న బిల్లులను దేశం ఎప్పటికీ సఫలం కానివ్వదన్నారు.

కొత్త చట్టంతో రైతులకు ప్రయోజనం ఏంటని మాజీ ప్రధాని దేవేగౌడ కేంద్రాన్ని ప్రశ్నించారు. వ్యవసాయ బిల్లులపై సందేహాలకు ప్రధాని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కరోనా సమయంలో ఆగమేఘాలపై బిల్లు ప్రవేశపెట్టారని విమర్శించారు.

Next Story