భారత్‌లో 24గంటల్లో 85 వేల కేసులు.. 1089 మరణాలు
By తోట వంశీ కుమార్ Published on 26 Sept 2020 10:26 AM ISTభారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 85,362 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 1,089 ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 59,03,933 కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో 48,49,585 మంది కోలుకోగా.. 9,60,696 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు ఈ మహమ్మారి బారిన పడి 93,379కి చేరింది. దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 82.14శాతం ఉండగా.. మరణాల రేటు 1.58శాతంగా ఉంది.
నిన్న ఒక్కరోజులోనే 13,41,535 కరోనా శాంపిళ్లను పరీక్షించగా.. మొత్తంగా 7,02,69,975 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉంది. 72,44,184 కరోనా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉంది. భారత్‌లో కరోనా విజృంభన ఇలాగే కొనసాగితే.. కొద్ది రోజుల్లోనే అగ్రస్థానానికి చేరుకోనుంది.