భారత్‌లో కరోనా విశ్వరూపం.. ఒక్క రోజే 551 మంది మృతి

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 10:27 AM IST
భారత్‌లో కరోనా విశ్వరూపం.. ఒక్క రోజే 551 మంది మృతి

భారత్‌లో కరోనా మహమ్మారి విలయతాండం కొనసాగుతోంది. గత కొద్ది రోజులుగా ప్రతి రోజు 24వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 28,637 కేసులు నమోదు కాగా.. 551 మంది మృత్యువాత పడ్డారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీటితో కలిపి దేశంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,49,553కి చేరింది. ఈ మహమ్మారి భారీన పడి 22,674 మంది ప్రాణాలు కోల్పోయారు.

మొత్తం నమోదు అయిన కేసుల్లో 5,34,621 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 2,92,258 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. దేశంలో అత్యధిక కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదు అవుతున్నాయి. ఇప్పటి వరకు అక్కడ 2,46,600 కేసులు నమోదు కాగా.. 10,116 మంది చనిపోయారు. ఆ తరువాత తమిళనాడులో 1,34,226 కేసులు నమోదు కాగా.. 1898 మంది మరణించారు. దిల్లీలో 1,10,921 కేసులు నమోదు కాగా.. 3334 మంది మృత్యువాత పడ్డారు. కాగా.. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండడంతో పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌లు విధిస్తున్నారు. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా కరోనా కేసులు నమోదు అవుతున్న దేశాల్లో భారత్‌ మూడో స్థానంలో ఉంది.

Next Story