బెంగళూరు.. వారం రోజుల పాటూ లాక్ డౌన్..!

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 July 2020 2:17 AM GMT
బెంగళూరు.. వారం రోజుల పాటూ లాక్ డౌన్..!

కర్ణాటక రాష్ట్రంలోనూ, బెంగళూరు నగర పరిధిలోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతూ ఉన్నాయి. గత కొద్దిరోజులుగా బెంగళూరులో లాక్ డౌన్ విధించే అవకాశం ఉందంటూ పలు ఊహాగానాలు మొదలయ్యాయి. తాజాగా కర్ణాటక ప్రభుత్వం బెంగళూరులో లాక్ డౌన్ అమలుచేయాలని నిర్ణయం తీసుకుంది.

బెంగళూరు అర్బన్, రూరల్ ప్రాంతాల్లో జూన్ 14వ తేదీ నుంచి జూన్ 23వ తేదీ వరకు లాక్ డౌన్ ను అమలుచేయనుంది. 14వ తేదీ రాత్రి 8 గంటలకు లాక్ డౌన్ మొదలై, 23వ తేదీ ఉదయం 5 గంటల వరకు కొనసాగనుందని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలకు మాత్రం అనుమతి ఉంటుందని తెలిపింది.

బెంగళూరు అర్బన్ జిల్లాలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు చాలా ఎక్కువ అవుతూ ఉన్నాయి. కర్ణాటకలో కరోనా పాజిటివ్ కేసులు 36,216 ఉండగా, బెంగళూరు అర్బన్ లోనే ఏకంగా 15000కు పైగా కేసులు నమోదయ్యాయి. కర్ణాటక రాష్ట్రంలో 14716 మంది రికవర్ అయ్యారు.. 613 మంది చనిపోయారని స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ తెలిపింది.

లాక్ డౌన్ సమయంలో ఆసుపత్రులు, సరుకులు, పాలు, కూరగాయలు, మందులు, నిత్యావసర సరుకులు అందుబాటులో ఉండనున్నాయి. ప్రభుత్వం అనుకున్నట్లుగా పరీక్షలు కూడా జరుగుతూ ఉన్నాయి. అన్ లాక్ 2.0లో భాగంగా కర్ణాటక రాష్ట్రంలో అయిదు ఆదివారాలు పూర్తిగా లాక్ డౌన్ లోనే ఉండనున్నాయి. జులై 5 నుండి ఆగస్టు 2 వరకూ ఆదివారాలు పూర్తీ లాక్ డౌన్ చేస్తున్నారు. పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా శనివారం పూట కూడా లాక్ డౌన్ ను అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆదివారాల సమయంలో పూర్తీ లాక్ డౌన్ ను అమలుచేయకుండా కొన్ని ఎమర్జెన్సీ సర్వీసులకు అనుమతి ఇచ్చారు. అతి తక్కువమందితో పెళ్లిళ్లు చేసుకునే వెసులుబాటును కల్పించారు. ప్రజలు తిరగడం తగ్గితే కరోనా వ్యాప్తి కూడా తగ్గుతుందని డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సి.ఎన్.అశ్వత్ నారాయణ్ తెలిపారు. ఈ లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ వ్యాప్తిని కొంతవరకూ కట్టడి చేయొచ్చని ఆయన తెలిపారు.

Next Story