కరోనా మహమ్మారి బారిన పలువురు ప్రముఖులు పడుతూ ఉన్నారు. బాలీవుడ్ నటుడు బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కరోనా వైరస్ బారిన పడ్డారు. కరోనా పాజిటివ్ అని రావడంతో అమితాబ్ బచ్చన్ ను ఆసుపత్రికి తరలించారు. 77 సంవత్సరాల అమితాబ్ బచ్చన్ తనకు కరోనా వైరస్ సోకిందని ట్విట్టర్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. తన దగ్గర పని చేసే వారికి, కుటుంబ సభ్యులకు టెస్టులు చేస్తున్నారని, రిజల్ట్స్ రావాల్సి ఉందని ఆయన అన్నారు.

“I have tested CoviD positive .. shifted to Hospital .. hospital informing authorities .. family and staff undergone tests , results awaited .. All that have been in close proximity to me in the last 10 days are requested to please get themselves tested !” అని అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశారు.

‘నాకు కోవిద్ పాజిటివ్ వచ్చింది. ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. కుటుంబ సభ్యులకు, నా స్టాఫ్ కు టెస్టులు చేశారు.. రిజల్ట్స్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాం. గత పది రోజులుగా తనకు దగ్గరగా వచ్చిన వారందరూ ఓ సారి టెస్టులు చేయించుకోండి’ అని బిగ్ బీ తెలిపారు.

అమితాబ్ బచ్చన్ త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు ట్వీట్ చేశారు. ‘మీరు మునుపటి కంటే ఆరోగ్యంతో తిరిగి వస్తారు అని కోరుకుంటున్నా’ అని తాప్సీ పన్ను ట్వీట్ చేసింది. సోనూ సూద్ ‘గెట్ వెల్ సూన్ సార్’ అని కామెంట్ పెట్టాడు. మరికొందరు బాలీవుడ్ ప్రముఖులు కూడా అమితాబ్ బచ్చన్ ఆరోగ్యంగా ఉండాలని, తొందరగా కరోనా నుండి కోలుకోవాలని కోరుతున్నారు. అభిమానులు కూడా అమితాబ్ ఆరోగ్యంగా ఉండాలని కోరుతున్నారు.

ఇదిలావుంటే.. ఈ రోజు ఉద‌యం నేను, నా తండ్రి COVID 19 నిర్థార‌ణ పరీక్ష చేయించుకున్నాం. క‌రోనా పాజిటివ్‌ లక్షణాలు ఉండ‌టంతో మే ఇద్దరం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాం. అధికారులు మా కుటుంబం మరియు సిబ్బందికి కూడా పరీక్షలు చేస్తున్నారు. అంద‌రూ కంగారు ప‌డ‌కుండా ప్రశాంతంగా ఉండాలని అభ్యర్థిస్తున్నానని అమితాబ్ త‌న‌యుడు అభిషేక్ బ‌చ్చ‌న్ ట్వీట్ చేశారు.

అమితాబ్ బచ్చన్ ఇటీవలే అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన గులాబో సితాబో సినిమాలో కనిపించారు. మరో రెండు సినిమాలు కూడా రిలీజ్ కు రెడీగా ఉన్నాయి. అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న బ్రహ్మాస్త్ర సినిమాలో కూడా అమితాబ్ కీలక పాత్రలో నటిస్తూ ఉన్నాడు. ఈ సినిమాల్లో రణబీర్ కపూర్, ఆలియా భట్ జంటగా నటిస్తూ ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహా రెడ్డి సినిమాలో అమితాబ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే..!

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet