కొత్త హీరోయిన్ అనుకుంటే మాత్రం పొరబడ్డట్లే..
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 6 Jun 2020 2:59 PM ISTలాక్‌డౌన్ కారణంగా ఎంతో బిజీగా ఉండే సెలబ్రిటీలు ఖళీ దొరకడంతో తమ తమ పనులను చక్కబెట్టుకుంటున్నారు. దాదాపు రెండు నెలలకు పైగా సమయం దొరకడంతో.. పిట్‌నెస్‌పై దృష్టి సారించారు చాలామంది సినీ ప్రముఖులు. అయితే.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ ఫోటో తెగ వైరల్ అవుతుంది. ఆ ఫోటో చూసిన కుర్రకారు ఎవరీ కొత్త హీరోయిన్ అని ఆలోచనలో పడుతున్నారంటే ఆలోచించండి.. ఆ నటి లాక్‌డౌన్‌కు ముందు ఎలా ఉందో.. ఇప్పుడు ఎలా ఉందో అర్థమవుతుంది.
సోషల్‌మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే అలనాటి అందాల తార ఖుష్బూ.. తన ఇన్‌స్టా అకౌంట్‌లో ఓ ఫోటో అప్‌లోడ్ చేసింది. అదీ లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలుగా ఇంటికే పరిమితమైన ఖుష్బూ ఎంతో చెమటోడ్చి రెండు నెలల్లో 15 కిలోల బరువు తగ్గి దిగిన ఫోటో. ఆ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ 'నేనేమైనా చెప్పాల్సిన అవసరముందా?' అంటూ అబిమానులకు ఓ ప్రశ్న సంధించింది.
ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఫోటో చూసిన అభిమానులు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. మీ బ్యూటీ సీక్రేట్ చెప్పండంటూ కొందరూ.. మీ అందం ఎప్పటికీ తరగదూ అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. కెరీర్ తొలినాళ్లలో ఖుష్బూ ఎంత సన్నగా ఉండేదో.. లాక్‌డౌన్ పుణ్యమానీ మళ్లీ అలా తయారయ్యింది.