కర్నూలులో బాలుడిపై నలుగురు లైంగిక దాడి

By అంజి  Published on  30 Jan 2020 6:56 AM GMT
కర్నూలులో బాలుడిపై నలుగురు లైంగిక దాడి

కర్నూలు జిల్లాలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అవుకు పట్టణంలో ఓ మైనర్‌ బాలుడిపై నలుగురు మానవమృగాలు లైంగికదాడికి పాల్పడ్డాయి. ఈ ఘటన కర్నూలు జిల్లాలో తీవ్ర కలకలం రేపుతోంది. అభంశుభం తెలియని బాలుడిని నలుగురు నిర్మానుష్య ప్రాంతానికి ఎత్తుకెళ్లారు. బాలుడి బెదిరించి నీఛాతి నీచమైన చర్యకు పాల్పడ్డారు. బాలుడు ఎంత గట్టిగా కేకలు వేసిన పట్టించుకోకుండా పైశాచికత్వానికి పాల్పడ్డారు. అయితే లైంగిక దాడి సమయంలో ఫోన్‌లో వీడియో కూడా చిత్రీకరించారు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపుతామంటూ బెదిరించారు.

అనంతరం నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎలాగోలా ఇంటికి చేరుకున్న బాలుడు.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు వివరించాడు. వెంటనే బాధితుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నలుగురు నిందితుల్లో ఇద్దరిని అరెస్ట్‌ చేశామని పోలీసుల తెలిపారు. మరో ఇద్దరు పరారీలో ఉండగా.. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు.

Next Story
Share it