మీరా చోప్రా గారు మీకు న్యాయం చేస్తాం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 Jun 2020 12:18 PM GMT
మీరా చోప్రా గారు మీకు న్యాయం చేస్తాం

ఎన్టీఆర్ అభిమానులు నటి మీరా చోప్రాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఆమె సోషల్ మీడియాలో ఎన్టీఆర్ కు కూడా ఈ విషయాన్ని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు తనను సామాజిక మాధ్యమాల్లో వేధిస్తున్నారని నటి మీరా చోప్రా ట్వీట్ చేయడమే కాకుండా.. సైబర్‌ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తనకు వచ్చిన బూతుల ట్వీట్స్ ను పోస్టు చేసిన మీరా చోప్రా దీనిపై ఎన్టీఆర్ స్పందించాలని ఇప్పటికే ఆమె ట్విట్టర్‌లో కోరారు.

తనను వేధిస్తున్న నెటిజన్లపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె ట్విట్టర్‌ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులను కోరారు. అనుచిత వ్యాఖ్యల కేసు ఢిల్లీకి బదిలీ అయింది. మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు చెప్పారు. మీరా చోప్రా ప్రస్తుతం ఢిల్లీలో ఉండడంతో కేసును అక్కడికి బదిలీ చేస్తున్నట్టు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు తెలిపారు. పోలీసులు ఎనిమిది ఖాతాల నుంచే ఆమెకు అసభ్యకరమైన సందేశాలు వచ్చినట్టు గుర్తించారు. నటి ఫిర్యాదుపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు తాజాగా, ‘67ఎ’ను కూడా జతచేశారు.తాజాగా మీరా చోప్రాకు న్యాయం జరిగేలా చేస్తామంటూ కేటీఆర్ స్పందించారు. భాద్యులపై సత్వరమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ, నగర కమీషనర్‌లను ఆదేశించామని కేటీఆర్‌ తన ట్వీట్‌ ద్వారా తెలిపారు. మేడమ్ ఈ ఫిర్యాదు గురించి తెలంగాణ డీజీపీ, హైదరాబాద్ పోలీసు కమీషనర్ కు ఆదేశాలను జారీ చేశామంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ట్వీట్లు చేసిన వారికి పోలీసులు తగిన గుణపాఠమే చెప్పబోతున్నారని జరుగుతున్న ఘటనలను చూస్తుంటే అర్థం అవుతోంది. ఆమెను బెదిరించిన వారి డీటెయిల్స్ కనుక్కునే పనిలో సైబర్ క్రైమ్ విభాగాలు ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story