మీరా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సైలెంట్ గా కౌంటరిచ్చిన కుష్బూ

By తోట‌ వంశీ కుమార్‌  Published on  4 Jun 2020 9:10 AM GMT
మీరా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్.. సైలెంట్ గా కౌంటరిచ్చిన కుష్బూ

మీరా వర్సెస్ ఎన్టీఆర్ ఫ్యాన్స్..రెండ్రోజులుగా సోషల్ మీడియాలో నడుస్తోన్న ట్రెండ్ ఇది. వాన సినిమాతో తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయమైన మీరా చోప్రా..రెండ్రోజుల క్రితం మీరా ఇచ్చిన లైవ్ చిట్ చాట్ లో ఓ అభిమాని ఎన్టీఆర్ గురించి ఒక్కమాటలో చెప్పమంటే అతను ఎవరో తెలియదంటూ సమాధానమివ్వడంతో మొదలైంది అసలు కథ. మీరా లైవ్ చిట్ చాట్ లో చెప్పిన సమాధానం విన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఊరుకుంటారా మరి ? రెండ్రోజులుగా నెట్టింట్లో ఆమెను ట్రోల్స్ చేస్తూనే ఉన్నారు. ఫ్యాన్స్ ట్రోలింగ్ తో విసిగిపోయిన మీరా ఏకంగా సైబర్ క్రైమ్ ను ఆశ్రయించింది. మరో ట్విస్ట్ ఏంటంటే..మీరాకు గాయని చిన్మయి శ్రీపాద మద్దతివ్వడం.

అలా లైవ్ చిట్ చాట్ లో కావాలని అన్నదో లేక పొరపాటున మాట దొర్లిందో గానీ..అది కాస్తా చిలికి చిలికి గాలి, వానగా మారింది. అయితే..ఈ వివాదంలోకి సీనియర్ నటి కుష్బూ సుందర్ ఎంట్రీ ఇచ్చి సైలెంట్ గా కౌంటరిచ్చారు. కొంతమంది మహిళలు ఎప్పటికీ తమ ధోరణి మార్చుకోరు..ఏమీ నేర్చుకోరు కూడా..ఈ విషయంలో మాత్రం వాళ్లు పేదవాళ్లనే చెప్పాలంటూ సైలెంట్ గా కౌంటరిచ్చారు. కుష్బూ ట్వీట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..ఇదిగో చూడు..ఈ కౌంటర్ నీకేనంటూ మీరా చోప్రాను ఆ ట్వీట్ వద్ద ట్యాగ్ చేస్తున్నారు. కుష్బూ వేసిన కౌంటర్ పై మీరా ఇంతవరకూ స్పందించలేదు.Next Story
Share it