చెప్పినట్లుగానే ఆరు అంబులెన్సులను అందజేసిన కేటీఆర్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  30 July 2020 10:59 AM GMT
చెప్పినట్లుగానే ఆరు అంబులెన్సులను అందజేసిన కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర మంత్రి, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌.. తన పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఆరు కరోనా రెస్పాన్స్ అంబులెన్స్ లను ఇస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా.. గురువారం ప్రగతి భవన్‌లో ఆరు కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌ను ఆరోగ్యశాఖకు అందజేశారు. వీటిని ఆరోగ్యశాఖ మొదట కోవిడ్ రెస్పాన్స్ వెహికిల్స్‌గా వాడినప్పటికీ తరువాత అంబులెన్స్‌లుగా వినియోగిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఆరు వాహనాలను అందించడం ఆనందంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్ సతీమణి శైలిమ, కూతురు అలేఖ్య పాల్గొన్నారు. ఇప్పటికే మంత్రి కేటీఆర్ స్ఫూర్తితో పలువురు అంబులెన్సులు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా కేటీఆర్ కి తెలిపారు. గత వారం నేను ప్రకటించినట్టుగానే ఇది నాశక్తి మేరకు నేనందిస్తున్న వ్యక్తిగత కాంట్రిబ్యూషన్ అని మంత్రి కేటీఆర్ తన అధికారిక ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.Next Story