'కరోనా వైరస్‌' ఎలా సోకుతుంది.. లక్షణాలేంటీ..?

By సుభాష్  Published on  25 Jan 2020 9:34 AM GMT
కరోనా వైరస్‌ ఎలా సోకుతుంది.. లక్షణాలేంటీ..?

'కరోనా వైరస్' ప్ర‌స్తుతం జ‌నాల‌ను వ‌ణికిస్తోంది. చైనాలో ప్ర‌జ‌లకు ప్రాణ‌సంక‌టంగా మారింది. చైనాతో పాటు ఇత‌ర ఇదేశాల‌కు, రాష్ట్రాల‌కు శ‌ర‌వేగంగా వ్యాపిస్తోంది. ఈ వైర‌ల్ వ‌ల్ల ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డం త‌ప్ప‌ని స‌రని వైద్యులు చెబుతున్నారు. క‌రొనా అనే క్రిమి వ‌ల్ల వ్యాపిస్తున్న ఈ వ్యాధి ల‌క్ష‌ణాలు, త‌గు జాగ్ర‌త్త‌ల గురించి వైద్యులు వివ‌రిస్తున్నారు. ఈ వ్యాధిపై ప్ర‌తి ఒక్క‌రిలో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం త‌ప్ప‌నిస‌రి. వైద్య నిపుణులు చెబుతున్న వివ‌రాల ప్ర‌ర‌కారం..

కరోనా వైరస్ గురించి..

ఈ వైర‌ల్ అనేది కొన్ని వైర‌స్ల స‌మూహం. ఈ వైర‌స్ లు కొన్ని జంతువుల‌కు మాత్ర‌మే వ్యాపిస్తాయి. ఇందులో కొన్ని వైర‌స్‌లు మాత్రం ప్ర‌జ‌ల‌పై కూడా ప్ర‌భావం చూపుతాయి. ఈ వైర‌ల్ వ్యాపిస్తే శ్వాస‌ సంబంధిత వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు వ‌చ్చి ప్రాణాలు పోయే ప‌రిస్థితి కూడా ఉంటుంది. ఈ వైర‌స్ తీవ్ర‌త‌ర‌మైతే న్యూమోనియా, ఇత‌ర వ్యాధులు చుట్టుముట్టే ప్ర‌మాదం లేక‌పోలేదని వ్యైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వైర‌ల్ ఎలా వ్యాపిస్తుంది

కరోనా వైరస్ అతివేగంగా వ్యాపిస్తుంది. ఈ వైరస్ జంతువుల నుంచి వ్యాపిస్తున్నట్లు గుర్తించారు. ఇది వ్యాపించ‌డానికి అనేక కార‌ణాలున్నాయి. సాధార‌ణంగా ఒక మ‌నిషి నుంచి మ‌రో మ‌నిషికి ఈ వైరస్‌ వ్యాపిస్తుంది. దగ్గు, తుమ్మినప్పుడు కూడా వచ్చే తుంపర్ల ద్వారా వేగంగా వ్యాపిస్తుంది. శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్‌ వ్యాపిస్తుంది స్పర్శ, షేక్‌ ‌హ్యాండ్‌ వల్ల కూడా వ్యాధి వ్యాపించే అవకాశాలు చాలా ఉన్నాయి. వైరస్‌ ఉన్న వ్యక్తులను ముట్టుకున్నా.. తర్వాత చేతులను శుభ్రం చేసుకోకపోయినా, శరీరభా భాగాలను తాకినా వ్యాపిస్తుంది.

లక్షణాలు

ఈ వైరల్‌ లక్షణాలు ఒక్కో విధంగా ఉంటాయంటున్నారు వైద్యులు. ఒక్కోసమయంలో మీకు వ్యాధి తీవ్రత ఎలా ఉందో దానిపై ఆధారపడి ఉంటుందని, జలుబు, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడుతుండటమే కాకుండా మరికొన్ని సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయంటున్నారు. ఈ వ్యాధి వల్ల జలుబు, తలనొప్పి, మోకాళ్ల నొప్పి, దగ్గు, జ్వరం వస్తుంది. కరోనా వైరస్‌లు శరీరంలో ప్రవేశించిన తర్వాత అనేక తీవ్ర లక్షణాలను చూపుతుంది. దీని వల్ల కఫంతో కూడిన దగ్గు ఉంటుంది. ఊపిరి తీసుకోవడం కష్టం మారుతుంది. అలాగే ఛాతిలో నొప్పిగా ఉంటుంది.

కరోనా వైరస్‌ను ఎలా గుర్తించగల్గుతాం

పైన పేర్కొన్న లక్షణాలుంటే వెంటనే వైద్యున్ని సంప్రదించాలి. రక్త పరీక్షల ద్వారా వైరస్‌ను గుర్తించవచ్చు. ఇక కఫం, గొంతు శుభ్రపరిచి, ఇతర శ్వాస పరీక్షల ద్వారా గుర్తించవచ్చు.

చికిత్స విధానం

కరోనా వైరస్‌ వ్యాపించినట్లయితే కొన్ని రకాల చికిత్సల ద్వారా దీనిని నయం చేసుకునే అవకాశం ఉంది. నొప్పి, జ్వరం, దగ్గుకు సంబంధిచిన మందులను తీసుకోవచ్చు. పిల్లలకు మాత్రం ముఖ్యంగా నాలుగేళ్లలోపు పిల్లలకు దగ్గు మందు, ఆస్పిరిన్‌ ఇవ్వకూడదంటున్నారు వైద్యులు. ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. నీళ్లను అధికంగా తాగుతుండాలి. ఇలా మందులను క్రమం తప్పకుండా వాడితే కోలుకునే అవకాశం ఉంటుందని వైద్యులు సూచిస్తున్నారు.

Next Story