నిన్ను జ‌ట్టులోకి తీసుకుంటాం.. అందుకే అత‌న్ని వ‌దులుకున్నాం.!

By Medi Samrat  Published on  20 Nov 2019 4:53 PM IST
నిన్ను జ‌ట్టులోకి తీసుకుంటాం.. అందుకే అత‌న్ని వ‌దులుకున్నాం.!

ముఖ్యాంశాలు

  • క్రిస్‌లిన్‌ను వ‌దులుకోవ‌డంపై యువ‌రాజ్ కామెంట్
  • యువ‌రాజ్ కు కౌంట‌ర్ ఇచ్చిన కేకేఆర్‌ సీఈఓ

కేకేఆర్ ఐపీఎల్‌ 2020 సీజన్‌ వేలంలోకి ఆ జ‌ట్టు స్టార్ హిట్టర్‌ క్రిస్‌లిన్‌ను విడిచిపెట్టడంపై టీమిండియా మాజీ ఆట‌గాడు యువరాజ్‌ సింగ్ స్పందించిన విష‌యం తెలిసిందే. అయితే.. యువీ విమర్శలపై కేకేఆర్‌ సీఈఓ వెంకీ మైసూర్ కౌంట‌ర్ ఇచ్చాడు. ‘యువీ మేం హిట్టర్‌ క్రిస్‌ లిన్‌ను వదిలిపెట్టాం... కానీ.. కేకేఆర్‌ వేలంలో నిన్ను తీసుకోవడానికి బిడ్‌ వేయవచ్చు! మీ ఇద్ద‌రి (లిన్‌, యువీ) పై ప్రేమ, గౌరవం ఎప్పటికీ ఉంటుంది’ అంటూ ట్వీట్‌ చేశాడు.

అయితే.. క్రిస్‌లిన్‌ని కేకేఆర్‌ ఎందుకు రిటైన్ చేసుకోలేదో అర్థం కావడం లేద‌ని.. అతడిని వేలంలోకి వదిలేయడం కేకేఆర్‌ చెత్త నిర్ణయం.. ఈ విషయమై కేకేఆర్ స‌హ‌ యజమాని షారూక్ ఖాన్‌కి మెసేజ్ చేస్తా’ అని యువరాజ్ అనడంపై కేకేఆర్‌ సీఈఓ పైవిధంగా స్పందించాడు.

ఇక‌.. ఐపీఎల్‌–2020 వేలంలో ఎనిమిది ఫ్రాంచైజీలు పెద్ద సంఖ్యలో ఆటగాళ్లను వదిలేసుకున్నారు. వీరిలో కొందరు వరుస వైఫల్యాలతో రాణించ‌క దూర‌మ‌వ‌గా... మరికొందరు భారీ మొత్తాలకు అమ్ముడై కూడా సాధార‌ణ స్థాయి ప్ర‌ద‌ర్శ‌న‌తో వారి వారి జ‌ట్ల‌కు దూర‌మ‌య్యారు. అధేవిధంగా కేకేఆర్ కూడా స్టార్‌ ఓపెనర్‌ క్రిస్‌ లిన్‌ను వదిలేసుకుంది.

అయితే.. గ‌త వేలంలో క్రిస్‌లిన్ ను కేకేఆర్ రూ 9.6 కోట్లు చెల్లించి ద‌క్కించుకుంది. మ‌ర‌లా అంతే చెల్లించాల్సి రావడంతోనే అతన్ని కేకేఆర్‌ వదిలేసుకుందనేది స‌మాచారం. కాగా.. అబుదాబి టీ10 లీగ్‌లో అత్యధిక వ్యక్తిగత పరుగుల రికార్డు క్రిస్‌లిన్‌ ఇటీవలే సొంతం చేసుకున్నాడు. మరాఠా అరేబియన్స్‌ తరుఫున లిన్‌ 30 బంతుల్లో 91 పరుగులు చేశాడు. కేకేఆర్‌ వదిలేసిన రోజుల వ్యవధిలోనే ఈ రికార్డును లిన్‌ సాధించాడు. ఈ హ‌ఠాత్త్ ప‌రిణామంతో కేకేఆర్ అంత‌ర్మ‌థ‌నంలో ప‌డుతుంద‌నేది మాత్రం వాస్త‌వం.

ఇదిలావుంటే.. ఈ వేలంలో జయదేవ్‌ ఉనద్కత్ (రాజ‌స్థాన్ రాయ‌ల్స్), వరుణ్‌ చక్రవర్తి (కింగ్స్ ఎలెవ‌న్ పంజాబ్) ల‌ను కూడా ఆ ఫ్రాంచైజీలు వదిలేసుకున్నాయి.

ఇక‌పోతే.. లిన్‌ను వదిలేయడంపై యువ‌రాజ్.. లిన్‌ను వదిలేయడం కేకేఆర్‌ బ్యాడ్‌ కాల్ అని అన్నాడు. ఇది తనకు ఓ జోక్‌గా అనిపిస్తుందన్నాడు. ఈ విషయాన్ని అసలు కేకేఆర్‌ సహ యజమాని షారుఖ్‌ ఖాన్‌ తెలియజేశారో, లేదో అంటూ యువరాజ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ఒకవేళ షారుఖ్‌ కూడా అతని వదిలేయడానికి ఇష్టపడితే అప్పుడు రిలీజ్‌ చేసినా ఇబ్బంది ఉండదన్నాడు.

లిన్ నేను చూసిన ఐపీఎల్ ఆట‌గాళ్ల‌లో ఒక ప్రత్యేక ఆటగాడని.. కేకేఆర్‌కు ఎన్నోసార్లు మంచి ఆరంభాలు ఇచ్చాడని.. అసలు అతన్ని ఎందుకు జ‌ట్టులో కొన‌సాగించ‌ట్లేదో తెలియట్లేద‌ని అన్నాడు. అలాగే.. నా వరకూ అయితే అది కేకేఆర్‌ తప్పుడు నిర్ణయమ‌ని.. దీనిపై షారుఖ్‌కు మెస్సేజ్‌ ఉందా.. ప్రస్తుత టీ20 ఫార్మాట్‌లో లిన్‌ అసాధారణ ఆటగాడు’ అని యువీ పేర్కొన్నాడు. అయితే.. యువ‌రాజ్ వ్యాఖ్య‌ల ప‌ట్ల బాలీవుడ్ బాద్‌షా ఫారుఖ్ ఖాన్, క్రీడాభిమానులు ఎలా స్పందిస్తారో చూడాలి మ‌రి.

Next Story