ఫస్ట్ క్రష్, ఫస్ట్ కిస్.. సీక్రెట్స్ చెప్పేసిన నాగ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 May 2020 9:31 AM IST
ఫస్ట్ క్రష్, ఫస్ట్ కిస్.. సీక్రెట్స్ చెప్పేసిన నాగ్..!

టాలీవుడ్ కింగ్ గా పేరు సంపాదించుకున్న మన్మథుడు నాగార్జున ఓ దశలో అమ్మాయిలకు గ్రీకువీరుడిగా మారాడు. నిన్నే పెళ్లాడుతా సినిమాతో మగువల మనసులను దోచుకున్న ఈ మన్మథుడి రీల్ లైఫ్ కు రియల్ లైఫ్ కు పెద్దగా ఏం తేడా ఉన్నట్లు అస్సలు అనిపించదు. టాలీవుడ్ వర్గాలు కూడా నాగ్ రియల్ లైఫ్ కూడా చాలా రొమాంటిక్ గా ఉంటుందని చెప్పుకుంటుంటాయి. ఏ సినిమా అయినా సరే అందులో నాగ్ రొమాన్సే హైలెట్ అవుతుంది. అలాంటి నాగ్ తన జీవితంలో మొదటగా ప్రేమించిన అమ్మాయి ఎవరో, ఎవరితో తన ఫస్ట్ కిస్ ను పంచుకున్నాడో తెలుసుకోవాలన్న కుతూహలం ఉండటం సాధారణం. ఎందుకంటే ఈ రోజుల్లో మన జీవితం కన్నా పక్కోడి జీవితం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి చాలా మందికి ఉంటుంది కదా.

ఇక అసలు విషయానికొస్తే ఫస్ట్ క్రష్ ఎవరితో కలిగిందో, ఫస్ట్ కిస్ ఎవరికి పెట్టారో ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అందరిలాగానే తన ఫస్ట్ క్రష్ కూడా స్కూల్ డేస్ లోనే మొదలైందని చెప్పుకొచ్చారు నాగ్. స్కూల్ లో ఓ టీచర్ ను ప్రేమించానని, కానీ ఆ విషయాన్ని ఆమెకు చెప్పే ధైర్యం చేయలేక మౌనంగా ఉండియానని పేర్కొన్నారు. టీచర్ కు ప్రేమ విషయాన్ని చెప్పలేకపోవడం చాలా గుండెకోతను మిగిల్చిందన్నారు. ఫస్ట్ కిస్ విషయానికొస్తే నాగ్ కాలేజీలో చదువుకునే రోజుల్లో ఓ అమ్మాయిని ముద్దు పెట్టుకున్నట్లు చెప్పారు. ఆ అమ్మాయి పేరు చెప్పలేను కానీ..ఆమె దూరమైందన్న భావన వచ్చినప్పుడల్లా మనసుకు చాలా కష్టంగా ఉంటుందన్నారు నాగ్.

Next Story