ఖమ్మం లో ఉద్రిక్తత ... బస్సుల ధ్వంసం

By Medi Samrat  Published on  13 Oct 2019 6:05 PM IST
ఖమ్మం లో ఉద్రిక్తత ... బస్సుల ధ్వంసం

ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు ఆగ్ర‌హంతో ఊగిపోతున్నారు. నిన్న ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసిన శ్రీనివాస‌రెడ్డి మ‌ర‌ణించ‌డంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా అదుపుత‌ప్పింది. దీంతో కార్మికులు కలెక్టరేట్‌ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా బస్సులపై ​కార్మికులు దాడి చేయడంతో నాలుగు బస్సుల అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అలాగే.. సమ్మె నేపథ్యంలో ఆందోళనలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న పలువురు కార్మికులు కూడా నేడు ఆస్పత్రి పాలయ్యారు. మరోవైపు సమ్మె చేస్తున్న కార్మికులతో చర్చలు జరిపేది లేదని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది.

Next Story